నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్

సినిమా పేరు : నరకాసుర

నటీనటులు : రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన, సంగీతన విపిన్, నాస్సర్, చరణ్ రాజ్, శత్రు, శ్రీమన్ తదితరులు

ఎడిటర్ : చి. వంశీ కృష్ణ

ఛాయాగ్రహణం : నాని చమిడ్శెట్టి

సంగీతం : నఫల్ రాజా

నిర్మాతలు : డాక్టర్ శ్రీనివాస్, కరుమూరు రాఘు

రచన మరియు దర్శకత్వం : సెబాస్టియన్ నోవా అకోస్ట జూనియర్ (సెబి జూనియర్)

కథ : శివ (రక్షిత్ అట్లూరి) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని కాఫీ ఎస్టేట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. శివని అతని మరదలు వీరమణి చిన్నతనం నుంచి ప్రేమిస్తుంది. కానీ శివ ఎస్టేట్ యజమాని మీనాక్షి (అపర్ణ జనార్దన్) తో ప్రేమలో పడతాడు. అతని మంచితనం చూసి మీనాక్షి కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఆ ప్రాంత ఎమ్మెల్యే వీరి నాయుడు (చరణ్ రాజ్) మీనాక్షి శివ పెళ్లి జరిపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత శివ అదృశ్యమయ్యాడు. మరోవైపు మీనాక్షి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. కొంతమంది హిజ్రాలు ఆమె ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడతారు. ఆమె ను చంపాలనే కుట్ర వెనుక ఎవరున్నారు? శివ ఏమయ్యాడు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :

ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ అద్భుతంగా ఉంది. కానీ కథనం కాస్త గందరగోళంగా ఉంది. ముఖ్యంగా మొదటి అరగంట దర్శకుడు చాలా బాగా రాశాడు. శివ, మీనాక్షిలు కేరళకు వెళ్లి హిజ్రాలతో పోరాడి చివరకు వారితో జీవించడము చాలా బాగుంది. కథకు కొత్తదనం తీసుకొచ్చి హిజ్రా కోణంలో యాక్షన్ సన్నివేశాలను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. క్లైమాక్స్ ఫైట్ సంతృప్తికరంగా ఉన్నాయి.

నటన పరంగా రక్షిత్ మరోసారి అద్భుతంగా నటించాడు. ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా సహజంగా, నేర్పుగా నటించారు. ఎట్టకేలకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించడంతో చరణ్ రాజ్ హిజ్రా పాత్ర లో మెరిశాడు. నాజర్ ఇతర నటీనటులు కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు.

టెక్నికల్‌గా ఈ సినిమా పలు అంశాల్లో ఆకట్టుకుంది. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే నఫల్ రాజా పాటలు మరియు నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్‌, కాస్ట్యూమ్స్‌ కూడా బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి, నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా తో సెబాస్టియన్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నప్పటికీ, చిత్ర నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాల గురించి అతనికి లోతైన అవగాహన ఉందని స్పష్టమవుతుంది. ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ, స్క్రిప్ట్‌ని ఇంకా మెరుగుపరుచుకోవచ్చు. మొత్తానికి సెబాస్టియన్ మాత్రం ఓ మంచి సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాడు.

ప్లస్ పాయింట్లు :

సంగీతం

సినిమాటోగ్రఫీ

ఫైట్స్

కథ

హీరో రక్షిత్

మైనస్ పాయింట్లు:

మొదటి భాగం

స్క్రీన్ ప్లే

తీర్పు :

ఇతరుల పట్ల దయ మరియు కరుణతో ఎలా ప్రవర్తించాలనే దాని గురించి చెప్తూ ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ సినిమా తప్పకుండా సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆకర్షణీయమైన కథనం మరియు ప్రభావవంతమైన నటన వెరసి ఈ సినిమా కి మంచి ఆదరణ లభించడం ఖాయం.

రేటింగ్ : 3/5