కుర్ర హీరోయిన్ లతోనే రవితేజ!!

రవితేజ హీరో గా మూడు సినిమాలు రూపొందుతున్నాయి. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా ఇప్పటికే విడుదల సిద్ధంగా ఉంది. డిసెంబర్ 23 వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుంది. ఆ తర్వాత అయన సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాను చేశాడు.

అంతే కాకుండా టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కూడా అయన నటించారు. ఇలా మూడు సినిమాలు చేస్తున్న ఈ హీరో ఈ మూడు సినిమాలలో కూడా యువ కథానాయికలకు అవకాశాలు ఇవ్వడం ఇవ్వడం విశేషం. ‘ధమాకా’ సినిమాలో ఆయనతో కలిసి శ్రీలీల నటించగా, రావణాసుర లో ఫారియా అబ్దుల్లా, అను ఇయన్యుయెల్, మేఘా ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ లు నటిస్తున్నారు.

ఇక టైగర్ నాగేశ్వర రావు లో అనుపమా పరమేశ్వరన్ .. కావ్య థాపర్ కనిపించనున్నారు. సీనియర్ హీరోల సరసన సీనియర్ హీరోయిన్స్ దొరకడం కష్టమైపోతున్న ఈ ట్రెండులో, రవితేజ కుర్ర హీరోయిన్లతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఆశ్చర్యం.