విజయ్ దళపతి హీరో గా నటిస్తున్న వారసుడు సినిమా తమిళంలోనే తెరకెక్కడం తో తెలుగు లో దీన్ని డబ్బింగ్ సినిమా గా పరిగణించాలని చాలామంది చెబుతున్నారు. అయితే దీనికి తెలుగు దర్శక నిర్మాతలు చేయడం ఈ సినిమా విడుదల విషయం కొంత అయోమయం ఏర్పడింది. పండుగ సందర్భాలలో తమిళ సినిమాలు తెలుగు లో విడుదల అవకూడదనే రూల్ ఉంది.
అయితే ఈ రూల్ పరిస్తే మాత్రం ఈ సినిమా సంక్రాంతి కి విడుదల అవడం కష్టం అనే చెప్పాలి. నేపథ్యంలో ఈ వివాదంపై స్టార్ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్పందించారు. సినిమాలను అడ్డుకోవడం సాధ్యం కాదని సినిమాలకు ఎల్లలు లేవన్నారు. అంతే కాకుండా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా మంచి సినిమా ఎక్కడైనా ఆడుతుందని స్పష్టం చేశారు.
అల్లు అరవింద్ డబ్బింగ్ సినిమాల విషయంలో క్లారిటీ ఇవ్వడంతో నిర్మాతల మండలి కూడా స్పందించింది. తాము డబ్బింగ్ సినిమాలని అడ్డుకోమని చెప్పలేదని తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే చెప్పామని స్పష్టం చేసింది.