బుచ్చిబాబు కి ఈ సారైనా వెయిటింగ్ తప్పేనా!!

ఉప్పెన సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బుచ్చిబాబు తన రెండో సినిమా కోసం ఇబ్బందనులు పడుతున్నాడు. ఉప్పెన సినిమా చేసి వచ్చే ఫిబ్రవరికి రెండేళ్లు పూర్తి అవుతుంది. కానీ ఇంత వరకూ బుచ్చి బాబు తన రెండో ప్రాజెక్ట్ ని పట్టా లెక్కించలేకపోయాడు. కనీసం అధికారిక ప్రకటన కూడా లేదు.

దీనికి కారణం దర్శకుడు కేవలం స్టార్ హీరోలతోనే తదుపరి సినిమా చేయాలని కూర్చోవడమే అని తెలుస్తోంది. నిజానికి బుచ్చి టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ మూవీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ‘నాన్నకు ప్రేమతో’ టైంలో ఏర్పడిన పరిచయంతో యంగ్ టైగర్ కు ఓ కథ కూడా నేరేట్ చేసాడు.

బేసిక్ స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని రమ్మని బుచ్చికి చెప్పినట్లుగా చాలా నెలల క్రితమే వార్తలు వచ్చాయి. మరి ఈ సారైనా బుచ్చిబాబు వెయిటింగ్ ఎక్కువగా తీసుకోకుండా సినిమా చేస్తాడా అనేది చూడాలి.