ప్రియుడిని పెళ్లాడిన చైతు హీరోయిన్!!

నాగచైతన్య హీరో గా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా లో హీరోయిన్ గా నటించిన మంజిమ మోహన్ వివాహం ఘనం గా జరిగింది. కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తిక్ తో ఆమె వివాహం జరిగింది. చాలా కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు.

ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఒక హోటల్ లో వివాహం గ్రాండ్ గా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు వివాహానికి హాజరై యవజంటను ఆశీర్వదించారు.

సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడే గౌతమ్ కార్తీక్. ‘దేవరట్టం’ సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.