విడుదల 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్

దర్శకుడు: వెట్రిమారన్

నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్, రామారావు చింతపల్లి

సంగీతం: ఇళయరాజా

సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్

ఎడిటింగ్: ఆర్. రమర్

విడుదల తేదీ: 20 డిసెంబర్ 2024

సీక్వెల్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తి ఉంటుందని ‘విడుదల-2’ మళ్లీ రుజువు చేసింది. ‘విడుదల-1′ విజయం తర్వాత, వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించగా విడుదలకు ముందే మంచి అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుందో ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:’ప్రజాదళం’ నాయకుడు పెరుమాళ్‌ (విజయ్‌ సేతుపతి)ని పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా పార్ట్‌-1 భాగాన్ని కూడా ఇక్కడే ఆపేశారు… మళ్లీ పెరుమాళ్‌ అరెస్టుతోనే పార్ట్‌-2 కథను మొదలుపెట్టారు. కుగ్రామంలోని పిల్లలకు చదువు చెబుతున్న పెరుమాళ్‌, జమీందారీ వ్యవస్థను.. పెట్టుబడిదారుల అక్రమాలను .. అన్యాయాలను .. ఆగడాలను అడ్డుకునే క్రమంలో నాయకుడిగా మారతాడు.

నటీనటులు: విజయ్ సేతుపతి పెరుమాళ్‌గా తన అసాధారణమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించాడు.కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మంజు వారియర్ మహాలక్ష్మిగా తన పాత్రలో జీవం పోశారు. గౌతమ్ మీనన్, కన్నడ కిషోర్, సూరి తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికత: ఉద్యమ నేపథ్యంలోని కథలో ప్రేమకథను చేర్చి దర్శకుడు సవాలును సమర్థంగా నిర్వహించారు. కుల దురహంకారానికి బలైన కరప్పన్‌ అనే యువకుడి జీవితంలో జరిగిన దారుణంతో హింసమార్గాన్ని ఎంచుకుని పెరుమాళ్‌.. రెబల్‌గా మారే ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. ఆ సన్నివేశాన్ని దర్శకుడు చాలాబాగా రాశాడు. నక్సలైట్ అంశాన్ని లోతుగా చూపిస్తూ కథను యథార్థంగా తీర్చిదిద్దారు. ఇళయరాజా సంగీతం, వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ సినిమాను మరింత గొప్పగా ఉంచాయి.

తీర్పు: మొత్తం మీద, ‘విడుదల-2’ తన నటీనటుల ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం చిన్న నెగటివ్ పాయింట్.

రేటింగ్: 3/5