‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ శ్రీలీల – ఈ సినిమా సూపర్ హిట్ కావాలి

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్స్ బాబీ, బుచ్చి బాబు సానా, కార్తీక్ దండు, స్టార్ హీరోయిన్ శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

హీరో సొహైల్ మాట్లాడుతూ – నిర్మాతలంతా పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనుకుంటారు. కానీ ఎలాంటి మార్కెట్ లేని కొత్త హీరోలతో సినిమాలు చేస్తూ మాలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న సంస్థ మైక్ మూవీస్. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్, స్లమ్ డాగ్ హజ్బెండ్ లాంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. వాళ్ల కోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అలాగే సంజయ్ రావ్..ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. మంచి ప్రమోషన్ కోసం ట్రై చేశాడు. ఈ సినిమా హిట్ అయి సంజయ్ కు పేరు తీసుకురావాలి. అన్నాడు

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ – ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. పాటలు హిట్ అయ్యాయి. దర్శకుడు ఏ ఆర్ శ్రీధర్ విదేశాల్లో చదువుకుని వచ్చి ప్యాషన్ తో ఈ సినిమా చేశాడు. మంచి మనసున్న నిర్మాత అప్పిరెడ్డి. ఈ సినిమా ఆయనకు సూపర్ హిట్ ఇవ్వాలి. అన్నారు.

కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ – మా సినిమా కార్యక్రమానికి వచ్చిన శ్రీలీలకు థాంక్స్. ఈ సినిమా సెకండాఫ్ లో నాకు, బ్రహ్మాజీ గారికి ఉన్న కాంబినేషన్ సీన్స్ మిమ్మల్ని బాగా నవ్విస్తాయి. ప్లెజంట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. థియేటర్ లో చూసేందుకు రండి. అన్నారు.

నిర్మాత వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ – ఈ వేదిక మీద ఉన్న అందరు గెస్ట్ లకు థాంక్స్. మా బ్రదర్ అప్పిరెడ్డి ఎంకరేజ్ వల్లే ఈ మూవీలో పార్ట్ అయ్యాను. స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమాలో ఫన్, ఎమోషన్ ఉంటాయి. ఈ 29న చూడండి. అన్నారు

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ – మా ఫంక్షన్ కు శ్రీలీల వస్తుందని అనౌన్స్ చేయగానే…వెన్యూ పాస్ లు కావాలని ఎన్ని రిక్వెస్టులు వచ్చాయో లెక్కే లేదు. ఆమెకున్న క్రేజ్ అలాంటిది. మా మైక్ మూవీస్ సంస్థలో ఇప్పటిదాకా 5 సినిమాలు చేస్తే అందులో నలుగురు కొత్త డైరెక్టర్స్. శ్రీధర్ నాకు మూడు స్టోరీస్ పంపించాడు. ఆ మూడు కొత్తగా ఉన్నాయి. అందులో ఈ స్టోరి సెలెక్ట్ చేసుకున్నాం. బ్రహ్మాజీ గారు ఈ సినిమా చాలా సపోర్ట్ చేశారు. సంజయ్ టాలెంటెడ్ హీరో, అలాగే ప్రణవికి ఇన్ ఫ్లుయెన్సర్ గా పేరుంది. ఈ సినిమా మా అందరికీ పేరు తీసుకురావాలి. ఈ సినిమా హిట్ అయితే మరో పదిమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తాం. ఈ సినిమా బాలీవుడ్ , హాలీవుడ్ లో ఎక్కడా రాని లైన్ తో నిర్మించాం.అన్నారు.

విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ – స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమా రిలీజ్ అవుతోంది. హీరో సంజయ్, హీరోయిన్ ప్రణవి, దర్శకుడు శ్రీధర్, నిర్మాత అప్పిరెడ్డి గారు..వీరందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మైక్ మూవీస్ లో జార్జ్ రెడ్డి తర్వాత లాంటి క్రేజ్ ఉన్న సినిమా కావాలి. అన్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ – స్లమ్ డాగ్ హజ్బెండ్ ఎలా ఉంటాడో చూసేందుకు ఇక్కడికి వచ్చాను. బ్రహ్మాజీ గారు నాకు మంచి ఫ్రెండ్. ఒక మంచి ఆలోచన దర్శకుడికి రావడమే విజయానికి సంకేతం. ఆ ఐడియా సినిమాను ఎక్కడికో తీసుకెళ్తుంది. అలాంటి ఐడియాను ఈ సినిమాకు పిక్ చేశాడు శ్రీధర్. సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్. తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావాలని కోరుకుంటాం. ప్రణవి, శ్రీలీల బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయిలే. నా కొత్త సినిమాకు తెలుగు అమ్మాయినే తీసుకుంటా. అని అన్నారు.

దర్శకుడు ఏఆర్ శ్రీధర్ మాట్లాడుతూ – ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన అప్పరెడ్డి గారికి, వెంకట్ గారికి థాంక్స్. మా సినిమా హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. అలాగే మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సంజయ్, ప్రణవి జోడీ ఆకట్టుకునేలా ఉంటుంది. దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. ఒక కొత్త పాయింట్ తో మీ అందరికీ నచ్చేలా సినిమా చేశాను. అన్నారు.

హీరోయిన్ ప్రణవి మాట్లాడుతూ – ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత అప్పిరెడ్డి గారికి, దర్శకుడు శ్రీధర్ గారికి థాంక్స్. మా సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూసి నవ్వకుండా బయటకు రాలేరు. మీ బ్లెస్సింగ్స్ , సపోర్ట్ మాకు కావాలి. 29న స్లమ్ డాగ్ హజ్బెండ్ మూవీ చూడండి. అని చెప్పింది.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ – అప్పిరెడ్డి గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లుంది. ఆయన పేరు చెప్పగానే అరుపులు వినిపిస్తున్నాయి. ఆయన సినిమాలకు సెలెక్ట్ చేసుకునే కంటెంట్ బాగుంటుంది. జార్జిరెడ్డి సినిమాను థియేటర్ లో చూశాను. చాలా బజ్ క్రియేట్ చేశారు ఆ సినిమాకు. దర్శకుడు శ్రీధర్ గారు పూరి జగన్నాథ్ గారికి ఇష్టమైన వ్యక్తి. ఇవాళ పూరి గారు కూడా రావాల్సింది ఆయన షూటింగ్ లో ఉండి రాలేకపోయారు. బ్రహ్మాజీ గారు మంచి తనం పెంచుకుంటూ ఏజ్ ను ఎప్పుడో ఆపేసుకున్నారు. పవర్ సినిమా టైమ్ లో ఒక ఇబ్బందికర సందర్భంలో నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. సంజయ్ మంచి యాక్టర్. ఈ సినిమా అతనికి హిట్ తెచ్చిపెట్టాలి. అలాగే ప్రణవి తెలుగమ్మాయి. మా సర్దార్ గబ్బర్ సింగ్ లో చిన్న క్యారెక్టర్ చేసింది. వీళ్లందరికీ ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ – భగవంత్ కేసరిలో బ్రహ్మాజీ గారు, మేము సీన్స్ చేస్తున్నప్పుడే ఈ సినిమా గురించి తెలిసింది. వాళ్ల అబ్బాయి సంజయ్ హీరోగా నటిస్తున్నారు. బ్రహ్మాజీ గారిలాగే మంచి పర్మార్మెన్స్ చేసి ఉంటారు. ప్రణవి తెలుగు అమ్మాయి. ఇదొక గౌరవం ఉన్న ఇండస్ట్రీ. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే అడ్డేదీ ఉండదు. ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రణవికి నేను ఇచ్చే సలహా ఇదే. భీమ్స్ ధమాకా తర్వాత మళ్లీ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. సినిమా సూపర్ హిట్ కావాలి. అన్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ – ఇండస్ట్రీ అంతా ఈ సినిమాకు సపోర్ట్ చేసింది. మా డైరెక్టర్స్ బాబీ, బుచ్చిబాబు, కార్తీక్ ఈ ఫంక్షన్ కు రావడం సంతోషంగా ఉంది. శ్రీలీలతో నేను ఒకే సినిమా చేశాను. ఈ కొద్ది పరిచయం తోనే శ్రీలీల మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చారు. ఆమె స్టార్ డమ్ ఏంటో ఆమెకు తెలియదు. మైక్ మూవీస్ లో ఫీల్ గుడ్ సినిమాలు వస్తుంటాయి. వీళ్లు కంటిన్యూగా సినిమాలు చేయాలి. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలి. డైరెక్టర్ శ్రీధర్ డైలాగ్స్ చెబుతుంటేనే నవ్వొచ్చేది. అంత మంచి స్క్రిప్ట్ చేశాడు. భీమ్స్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. స్లమ్ డాగ్ హజ్బెండ్ థియేటర్ లో చూడమని కోరుకుంటున్నా. అన్నారు

హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ – కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ కు థాంక్స్. దర్శకుడు శ్రీధర్ గారు ఒక ఫ్రెండ్ లా సపోర్ట్ చేశారు. ఆయనతో ఏదైనా చెప్పుకునేంత ఫ్రెండ్ అయ్యారు. ప్రణవి కొత్త హీరోయిన్ కదా అనుకున్నా…కానీ తన పర్మార్మెన్స్ చూస్తే..నేను ఇంకా బాగా నటించాలి అనేంత జాగ్రత్త పడ్డాను. మనల్ని లైఫ్ లో సపోర్ట్ చేసేందుకు ఫ్యామిలీ ఉంటుంది. మా నాన్న, అమ్మ, నా వైఫ్ అలా నాకు సపోర్ట్ ఇచ్చారు. అందుకు థాంక్స్ చెబుతున్నా. సినిమా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.