చరణ్ – శంకర్ మూవీ ఫస్ట్ లుక్ కి రంగం సిద్ధం!!

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ప్రేక్షకులను వేరే స్థాయి లో అలరించడానికి సిద్ధమైపోతున్నాడు రామ్ చరణ్. అందుకే అయన శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. తమిళంలో ఎన్నో గొప్ప సినిమాలు చేసిన శంకర్ ఇప్పుడు తెలుగు లో తొలి సినిమా చేస్తుండడం విశేషం. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. ఏదేమైనా ఇది అందరి కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమా అనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చరణ్ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇంకోవైపు శంకర్ కమల్ హాసన్ సినిమా ను కూడా చేస్తున్నారు. రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. టైటిల్ పవర్ఫుల్ గా ఉండేలా చూస్తున్నారట. కానీ ఫ్యాన్స్ మాత్రం కొంత అసహనంగా ఉన్నారు.

ఆల్రెడీ టైటిల్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారనీ, దీపావళి రోజున టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. దాదాపు ఆ రోజున టైటిల్ బయటికి వచ్చేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా కియారా అద్వాని కనిపించనున్న సంగతి తెలిసిందే. విలన్ గా ఎస్ జె సూర్య నటిస్తున్నాడు.