ఫిల్మ్‌ఫేర్, లాక్మే లాంటి బ్రాండ్‌లకు ర్యాంప్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నటి సోనియా బన్సల్ IIFA కార్పెట్‌పై స్టైలిష్ వాక్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గులాబీ, పసుపు మైఖేల్ సింకో గౌను ధరించి ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ “ధీర” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనియా బన్సాల్. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫేమ్ లక్ష చదలవాడ హీరోగా నటిస్తున్నారు. ఈ ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నారు. తన మొదటి తెలుగు ప్రాజెక్ట్ విడుదలకు ముందే భాగమతి, పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించిన మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది సోనియా బన్సాల్.
ఆర్. పార్తిబన్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి సెరుప్పు సైజ్ మూవీతో సోనియా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2019లో విడుదలైన నాటీ గ్యాంగ్ చేసింది. ఆ వెంటనే దుబ్కీ సినిమా చేసింది. ఆనంద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని గావీ చాహల్, పంకజ్ ఝాతో కలిసి ఆనంద్ కుమార్ నిర్మించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం MX ప్లేయర్‌లో ప్రసారం అవుతోంది.
సోనియా తదుపరి ప్రాజెక్ట్ సమర్ ఖాన్ దర్శకత్వం వహించిన షూర్వీర్ అనే యాక్షన్-డ్రామా వెబ్ సిరీస్. ఇది హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది. ఈ సిరీస్ భారతదేశాన్ని బెదిరించే దాడి మూకల నేపథ్యంలో తెరకెక్కింది. దీంతో పాటు మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది సోనియా బన్సల్. ఇందులో కమల్‌ప్రీత్ జానీ దర్శకత్వం వహించిన పంజాబీ మ్యూజిక్ వీడియో ఖుద్‌గర్జే ఒకటి.
సుప్రసిద్ధ సంగీత లేబుల్ టిప్స్‌తో వరుస మ్యూజిక్ వీడియోలకు సంతకం చేసింది సోనియా. అందులో ఓ పాట “జిందగీ దో రోజ్ కి”. దీక్షా టూర్ పాడారు. సాహిత్యం ప్రియాంక ఆర్ బాలా. సంగీతం షమీర్ టాండన్. ఆమె పంజాబీ సాంగ్స్ ఫరక్, T-సిరీస్ లేబుల్ పై రిలీజ్ అయ్యాయి. PTC రికార్డ్స్ లో విడుదలైన మరో పంజాబీ మ్యూజిక్ వీడియో బర్సాత్. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటాలని ఆశిస్తోంది సోనియా బన్సాల్.