సినిమా పేరు : షరతులు వర్తిస్తాయి
విడుదల తేదీ : మార్చి 15, 2024
నటీనటులు : చైతన్య రావు, భూమిశెట్టి, నందకిషోర్, రాధికా, వెంకీ, పెద్దింటి అశోక్ తదితరులు
బ్యానర్ : స్టార్ లైట్ స్టూడియోస్
సంగీతం : అరుణ్ చిలువేరు
నిర్మాతలు : నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు
దర్శకత్వం : కుమారస్వామి
టాలీవుడ్ యంగ్ హీరో చైతన్య రావు, హీరోయిన్ భూమి శెట్టి నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ సాగే కథ హైలెట్‌గా నిలిచింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. కథ ఏంటంటే: హీరో చైతన్యరావు (చిరంజీవి) నీటిపారుదల శాఖలో ఒక చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. నాన్న లేని కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. తమ్ముడు, చెల్లి, అమ్మ, ఇల్లు గడవడం..ఇలా అన్నీ చూసుకుంటున్న చైతన్య రావు చిన్నప్పటి నుంచి హీరోయిన్ భూమిశెట్టి (విజయశాంతిని)ని ప్రేమిస్తూ ఉంటాడు. భూమిశెట్టి ఓ స్టేషనరీ షాపులో పనిచేస్తూ ఉంటుంది. వారిద్దరి కులాలు వేరు. కుటుంబ బాధ్యతలు చూస్తున్న చైతన్య రావు తన లవర్ భూమిశెట్టి తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ఏరియాలో చైన్ సిస్టమ్ లాంటి చిట్టీల బిజినెస్ ప్రారంభమవుతుంది. కొంత డబ్బు కట్టాక మరో నలుగురిని జాయిన్ చేపిస్తే లక్షాధికారులు అవ్వొచ్చని ఆ ఊరి ప్రజలను నమ్మిస్తారు.
అదే ఊరిలో కార్పొరేటర్‌గా గెలవడానికి ప్రయత్నిస్తున్న శంకరన్న ఆ చిట్టీల బిజినెస్‌కు అండగా నిలబడతాడు. శంకరన్నను వాడుకుని చిట్టీల కంపెనీ ఆ ఊరివాళ్ల దగ్గర డబ్బులు బాగా వసూలు చేస్తుంది. చైతన్య రావు తన భార్యతో స్టేషనరీ షాపును పెట్టించాలనుకుంటాడు. అందుకు కొంత డబ్బును కూడా భూమిశెట్టికి ఇస్తాడు. ఆ తర్వాత ఫీల్డ్ వర్క్ మీద చైతన్య రావు బయటకు వెళ్తాడు. ఆ సమయంలోనే చైతన్య రావు భార్య, తల్లి ఇద్దరూ చిట్టీల కంపెనీలో డబ్బులు పెడుతారు. ఆ రోజు రాత్రికి రాత్రే ఆ కంపెనీ జెండా ఎత్తేస్తుంది. దీంతో హీరో తల్లికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దీంతో చైతన్య రావు కుటుంబంతో సహా ఆ ఏరియాలో అందరూ రోడ్డున పడతారు. ఆ తర్వాత ఆ కంపెనీని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు?. శంకరన్నను ఎలా కార్పొరేటర్‌ను చేశాడు?. తన ఇంట్లో సమస్యలను ఎలా పరిష్కరించాడు? తన ఏరియా ప్రజలను ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ: షరతులు వర్తిస్తాయి సినిమా కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ. మిడిల్ క్లాస్ కుటుంబాలకు డబ్బు ఆశ చూపించి దోచుకునే మోసం గురించి, ఆ మోసాన్ని ఎదుర్కొని సమస్యను పరిష్కరించిన హీరో గురించి అద్భుతంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమకథ, కుటుంబ జీవితం చాలా చక్కగా చూపించారు. అందులోనే కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో రివీల్ చేసే ట్విస్ట్ అదిరిపోతుంది. రియాల్టీగా, మిడిల్ క్లాస్ బతుకుల మీద సాగే కథను అద్భుతంగా తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నడిపే వ్యక్తిగా చైతన్య రావు అలా ఒదిగిపోయారంతే. సినిమా అంతా రియల్ లొకేషన్స్‌లో చేయడం సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగుంది. చిట్టీల మోసాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీల చుట్టూ జరిగే తీరు, ఎమోషన్స్‌తో నడిచే పాత్రలను దర్శకుడు కుమారస్వామి అద్భుతం తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్ :
చైతన్య రావు నటన
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే :
తీర్పు: ఓవరాల్ గా షరతులు వర్తిస్తాయి సినిమా ఓ మధ్యతరగతి కుటుంబ కథ. సాఫీగా సాగుతున్న ఓ మధ్యతరగతి కుటుంబ జీవితం డబ్బుపై ఆశతో ఎలాంటి పరిస్థితులలోకి వెళ్లిందో ఈ సినిమా ద్వారా తెరపై చూడొచ్చు.
రేటింగ్ : 3/5