నిర్మాత ఎస్ కేఎన్ “కల్ట్ బొమ్మ” అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసారు

బేబి సినిమాతో టాలీవుడ్ కు కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన ఇంట్రెస్టింగ్ లైనప్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మించబోతున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కల్ట్ బొమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం ఆయన మల్టీపుల్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. వాటిలో రశ్మిక మందన్న లీడ్ రోల్ మూవీకి ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ అనౌన్స్ చేశారు.

సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా మరో సినిమా ప్రొడక్షన్ లో ఉంది. మరి ఈ కల్ట్ బొమ్మ అనే టైటిల్ ఏ సినిమాకు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇవి రెండు కాకుండా కల్ట్ బొమ్మ టైటిల్ తో మరేదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఏమైనా బేబి ప్రమోషన్ లో కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచుల్లో ఎస్ కే ఎన్ బాగా వాడి, ఆ పదాలను పాపులర్ చేశారు. ఈసారి అదే టైటిల్ తో సినిమా చేస్తుండటం ఇంట్రెస్టింగ్ గా ఉంది.