హిలేరియస్ గా ‘సేవ్ ద టైగర్స్’ ట్రైలర్ 

ఒకప్పుడు భార్య, భర్తకు అణిగిమణిగి ఉండేది. కాలం మారింది. ఇద్దరూ పనిచేస్తున్నారు. ఇద్దరూ అధికారం చెలాయిస్తున్నారు. అలా ఒకరినొకరు అర్థం చేసుకుని హాయిగా ఉండాల్సిన జంట మధ్య అహం అడ్డొస్తే.. ఆ అహం భార్యది అయి ఉంటే ఆ భర్తల పరిస్థితి ఏంటీ..? అంటే ఇదుగో ఇలా ఉంటుంది అంటూ డస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ అనే సిరీస్ తో వస్తున్నారు మహి వీ రాఘవ. అంతరించిపోతున్న పులుల్ని, భర్తలని కాపాడుకుందాం అనేది ఉపశీర్షిక మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్ గా తేజ కాకుమాను దర్శకత్వంలో రూపొందిన ఈ సీరీస్ కు ప్రదీప్ అద్వైతం రచయిత. ఈ నెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోన్న ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

ప్రియదర్శి – జోర్దార్ సుజాత, పావని – అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ – దేవయాని జంటలుగా నటించిన ఈ సిరీస్ ట్రైలర్ హిలేరియస్ గా ఉంది. భార్యలే భర్తలపై అధికారం చెలాయిస్తే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో.. ఎంత ఫ్రస్ట్రేట్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే భర్తలు కూడా పులుల్లా అంతరించిపోతారు అనే భయంతో ఉంటారు ఈ ముగ్గురు భర్తలు. మరి వారు అంతలా భయపడటానికి కారణాలేంటీ..? భార్యల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలేంటీ అనేది సిరీస్ లోనే చూడాలి. బట్.. ట్రైలర్ మాత్రం ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడబోతున్నాం అనే ఫీలింగ్ ను ఇచ్చింది. ఒకప్పటి జంధ్యాల మార్క్ క్లీన్ కామెడీని కూడా ఎక్స్ పెక్ట్ చేసేలా ఉంది.