ఆసక్తి పరుస్తున్న యానిమల్ లీక్ద్ ఫోటో!!

రణభీర్ కపూర్ హీరో గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యానిమల్ సినిమా నుంచి ఓ ఫొతో ఇప్పుడు నెట్టింట సంచలనం రేకెత్తిస్తుంది. రణ్ బీర్ కపూర్ చాలా సీరియస్ గా రక్తం అంటుకున్న చొక్కతో కనిపిస్తున్నాడు.

ఇటీవలే కాలంలో ఇంత ఇంటెన్స్ ఉన్న లుక్ ఏదీ రాలేదనే చెప్పాలి. రణభీర్ ను చూస్తుంటే చాలా డెడ్లీ లుక్ తో ఉన్నాడు. దర్శకుడు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. మొదటి సినిమా థాట్స్ ప్రకారమైతే అతని హీరో చాలా వైలెంట్ గా సీరియస్ గా ఉంటాడు అనిపిస్తోంది.

చాలా ఎమోషనల్ లవ్ కూడా జత చేస్తూ ఉంటాడు. కబీర్ సింగ్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఈ సినిమా తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.