“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా మంగళవారం ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ కథానాయకుడు అడవి శేష్‌తో పాటు బ్లాక్‌బస్టర్ నిర్మాత ఎస్కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషించిన దర్శకుడు కరుణకుమార్ తో, ప్రముఖ గాయకుడు పెంచలదాస్‌తో పాటు
చిత్రంలో నటించిన నటీనటులు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గోన్నారు. ఈ వేదికపై చిత్ర బిగ్ టికెట్‌ను అతిథులు అడవి శేష్, ఎష్‌కేఎన్‌లు ఆవిష్కరించారు. అనంతరం అడవి శేషు మాట్లాడుతూ “నా ఫస్ట్ సక్సెస్ క్షణంకు వర్క్ చేసిన టీమ్ అంతా ఈ టీమ్‌లో వున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. అతని ప్రతిభ నాకు తెలుసు. ఈ రోజు అతను ఓ బ్లాక్‌బస్టర్ సినిమా తీసి దానికి సీక్వల్ తీయడం ఆనందంగా వుంది. ఇది నా సొంత సినిమా లాంటింది.ఈ చిత్రానికి ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ వర్క్ చేశారు. తప్పకుండా ఈ చిత్ర మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది* అన్నారు. నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ సినిమాకు హిట్ కళ కనిపిస్తుంది. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే కష్టమే. సినిమాను ఆదరించే ఆడియన్స్‌కు మంచి సినిమా కావాలి అంతే. కొత్త కంటెంట్‌ను ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ టీమ్ కష్టం కనిపిస్తుంది. సినిమాకు ఓ ఫ్రాంచైజీ క్రియేట్ చేయడం కష్టం. అలాంటి అరుదైన ఫీట్ ఈ సినిమాకు కుదరింది. ఈ విషయంలో దర్శకుడిని అభినందిస్తున్నాను. ఈ సినిమాకు ఈ రోజు ఇంత బజ్ రావడానికి కారణం వంశీ నందిపాటి ఆయన అభిరుచే ఈ సినిమాకు ఇంత బజ్ తీసుకొచ్చింది. త్వరలోనే ఆయనను మనం పెద్ద నిర్మాతగా చూడబోతున్నాం. ఈ సినిమా పార్ట్ 1ను ఓటీటీలో చూసిన మనం పొలిమేర 2ను థియేటర్లో చూసి ఆ ట్బిస్ట్‌లు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ చిన్నసినిమాగా మొదలైన ఈ సినిమా ఈ రోజు పెద్ద సినిమాగా మారిందంటే అందుకు కారణం వంశీ నందిపాటి. పొలిమేర 2 విషయంలో నాకు బడ్జెట్ పరంగా సహకరించిన నిర్మాతకు థ్యాంక్స్. ఈ సినిమా విషయంలో నాకు హీరోయిన్ కామాక్షి గారి సహకారం మరువలేనిది. హీరోయిన్‌గానే కాకుండా దర్శకత్వ శాఖలో కూడా ఆమె ఎంతో డేడికేషన్‌తో పనిచేసింది. సంగీత దర్శకుడు గ్యానీ, కెమెరామెన్ రమేష్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌ల్లో వుంటారు. ఈ సినిమాకు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. పెద్ద సంస్థ ఈ చిత్రాన్నివిడుదల చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా రిజల్ట్ నాకు తెలుసు. ఈ సినిమా విజయంపై నేను చాలా నమ్మకంతో వున్నాను. అందరం తప్పకుండా సక్సెస్ మీట్లో కలుసుకుందా అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ దర్శకుడు అనిల్ ఈ సినిమాకు కర్మ కర్త క్రియ అంతా ఆయనే. నిర్మాత ఎంతో ఫ్యాషన్‌తో తీశాడు. ఈ రోజు ఇంత గొప్పగా 100 కోట్ల సినిమాలా కాన్ఫిడెంట్‌గా విడుదల చేస్తున్నామంటే వంశీ నందిపాటి కారణం. ఈ సినిమాకు టెక్నిషియన్సే హీరోలు. ఈ చిన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత గౌరిక్రిష్ణ మాట్లాడుతూ దర్శకుడు ఈ కథను ఎంతో అద్భుతంగా తీశాడు. ఈ సినిమా కంప్లీట్ చేయడానికి సత్యం రాజేష్ సహకారం మరువలేనిది. సినిమా టీమ్ అంతా ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ చిత్రం ఈ రోజు ఇంత గ్రాండ్‌గా విడుదల కావడానికి కారణం వంశీ నందిపాటి గారు. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. అన్నారు. కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ఈ సినిమాకు హీరోయిన్‌తో పాటు దర్వకత్వ శాఖలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు విశ్వనాథ్‌కు నా థ్యాంక్స్. ఈ సినిమా విడుదల తరువాత ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుంది* అన్నారు.