ఉప్పెన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా !!

ఉప్పెన సినిమా తో విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు ఇప్పుడు రెండో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే తన రెండో సినిమా ను ఎన్టీఆర్ తో చేసే విధంగా అయన ముందుకు వెళ్ళగా  ఈ కథను ఎన్టీఆర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కొరటాల తరువాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ప్రాజెక్టు ముందుగానే ఫిక్స్ అయింది.

దాంతో బుచ్చిబాబు ఇదే కథను చరణ్ కి వినిపించి ఆయనతో ఓకే అనిపించాడని అంటున్నారు. సుకుమర్ కి చరణ్ తోను మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఆయన చరణ్ ను ఒప్పించాడని అంటున్నారు.

డైరెక్ట్ చేసేది బుచ్చిబాబు అయినా, అవుట్ పుట్ విషయంలో సుకుమార్ హ్యాండ్ ఉంటుందనే ఉద్దేశంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు కేన్సిల్ కావడం కూడా చరణ్ ఈ సినిమా చేయడానికి మరో కారణమని అంటున్నారు. ఇంకా ఈ విషయంలో క్లారిటీ రావలసి ఉంది.