డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టిపై దాడి

ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రం డ్రింకర్ సాయి. ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టిపై దాడి జరిగింది. సక్సెస్‌ టూర్‌లో భాగంగా గుంటూరుకు వెళ్లిన ఆయన శివ థియేటర్‌ వద్ద మాట్లాడుతుండగా ఊహించని విధంగా ఆయనపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టిపై మంతెన సత్యనారాయణ ఫాన్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన్ను కించపరిచేలా సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సమాచారం.

కాగా.. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్‌ 27న థియేటర్లలో విడుదలైంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఓ డ్రింకర్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.