మసాలా యాడ్ లో మహేష్.. అదిరిపోయిన లుక్!!

మన హీరో లు సైడ్ ఇన్ కం గా యాడ్స్ కూడా చేస్తారన్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ ఎక్కువగా యాడ్స్ చేస్తుంటారు. తాజాగా అయన ఓ మసాలా యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్ లో మహేష్ బాబు హెయిర్ స్టైల్ మొదలుకుని గడ్డం మరియు మీసం వరకు ప్రతి ఒక్కటి కూడా భలే సెట్ అయ్యిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు మరియు కొత్త లుక్ మహేష్ బాబు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఇప్పటికే పట్టాలెక్కింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది.

ఈ నెలలో కీలకమైన షెడ్యూల్ ను ముగించి సంక్రాంతి తర్వాత కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.