అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిరకాలం మనల్ని నవ్విస్తూనే ఉండాలని అన్నారు ప్రముఖ నిర్మాత ఎస్ కేఎన్. మహా కుంభమేళాలో 150 ఏళ్ల వయసున్న సాధువులను చూశామని, బ్రహ్మానందం కూడా అలా తరతరాలు నవ్వులు పంచాలని ఎస్ కేఎన్ కోరారు. సప్తగిరి లీడ్ రోల్ చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్నారు ఎస్ కేఎన్.
ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గురించి నిర్మాత ఎస్ కేఎన్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక దిగ్గజ హాస్య నటుడిని గౌరవిస్తూ ఎస్ కేఎన్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి. ఎస్ కేఎన్ స్పీచ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు బ్యాక్ బోన్ గా నిలిచారని చెప్పారు ఎస్ కేఎన్. బ్రహ్మానందం గారి వీడియో చూడనిదే మాకు రోజు గడవదని, ఆయన తన కామెడీతో మనకు స్ట్రెస్ బస్టర్ అయ్యారని ఎస్ కేఎన్ అన్నారు.
తన గురించి హార్ట్ టచింగ్ గా మాట్లాడిన ఎస్ కేఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం. ఎస్ కేఎన్ గుండెల్లో నుంచి ఆ మాటలు చెప్పారని, ఇలాంటి వాళ్ల అభిమానం ఉన్నంతకాలం తనకు తిరుగులేదని, ఏ బాధ లేదని బ్రహ్మానందం చెప్పారు.