జోనర్ మారుస్తున్న గోపీచంద్.. హిట్ దక్కేనా!!

మాస్ హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు. ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు శ్రీవాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ను చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఇప్పటివరకు యాక్షన్ మాస్ మసాలా సినిమా లతో ఆకట్టుకున్న గోపీచంద్ ఇప్పుడు ఓ హారర్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

అయితే ఇంతవరకు గోపీచంద్ ఈ తరహా కంటెంట్ తో వచ్చింది లేదు. నాలుగు ఫైట్స్, రెండు రొమాంటిక్ సీన్స్, ఆరు పాటలు ఉండేలా చూసుకున్నాడు. కానీ ఏదో ఒకటి కొత్తగా ఫీల్ అయ్యే అంశాలతోనే ప్రేక్షకులు ఆకట్టుకోవాలని అతని సన్నిహితులు కూడా సలహాలు ఇస్తున్నారట.

అలా ఇప్పటివరకు సినిమాలు చేసిన వాళ్ళు చాలామంది సక్సెస్ కూడా అవడంతో అయన ఈ విధంగా సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నాడట. అందుకే ఆ కొత్త దర్శకుడు చెప్పిన పాయింట్ తోనే హారర్ కథను తెరపైకి తీసుకువచ్చే విధంగా చర్చలు జరుపుతున్నారట.త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది.