ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రిల్ రిలీజ్ కు రెడీ అవుతున్న డిఫరెంట్ క్రైమ్ కామెడీ మూవీ “తాగితే తందానా”

త్రిగుణ్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “తాగితే తందానా”. ఈ చిత్రాన్ని బీరం సుధాకర రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ గుప్తా హీరోయిన్.రియా అనే అమ్మాయి ఇంకో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇటీవలే సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ పొందిన “తాగితే తందానా” సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

 

మద్యం సేవించిన ఎవరైనా కామ్ గా పడుకోవాలని, తాగినప్పుడు బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందని అతిగా ఆలోచిస్తే లేనిపోని ఇబ్బందుల్లో పడతారనే విషయాన్ని “తాగితే తందానా” సినిమాలో ఫన్నీగా చూపించామని, అందుకే సినిమాకు డోంట్ డ్రింక్ అండ్ థింక్ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశామని మేకర్స్ చెబుతున్నారు. క్రైమ్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే “తాగితే తందానా” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

 

నటీనటులు – త్రిగుణ్, సప్తగిరి, సత్యం రాజేశ్, మధునందన్, విష్ణు ఓయ్, సిమ్రాన్ గుప్తా, రియా, తదితరులు

 

టెక్నికల్ టీమ్

 

డీవోపీ – ఎంఎన్ బాల్ రెడ్డి

ఎడిటర్ – బొంతల నాగేశ్వర రెడ్డి

మ్యూజిక్ – శ్రవణ్ భరద్వాజ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజిత పెద్దిరెడ్డి

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

నిర్మాత- బీరం సుధాకర్ రెడ్డి

రచన దర్శకత్వం – శ్రీనాథ్ బాదినేని