సినిమా : ‘.రామన్న యూత్’
బ్యానర్ : ఫైర్ ఫ్లై ఆర్ట్స్
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 15.09.2023
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్. కే
రచన దర్శకత్వం – అభయ్ బేతిగంటి.
సంగీతం – కమ్రాన్ ,
సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్
నటీనటులు : అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు
కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి,
సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి,
ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్,
ఆర్ట్ – లక్ష్మీ సింధూజ,
పీఆర్వో – జీఎస్కే మీడియా
బలగం వంటి సహజమైన నేటివ్ కథలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ “రామన్న యూత్”. టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 15 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రామన్న యూత్” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.
కథ:
ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది “రామన్న యూత్.”. సిద్దిపేట్ నియోజక వర్గం పరిధిలోని ఆంక్షాపూర్ గ్రామంలో ఉండే రాజు (అభయ్) పొలిటికల్ లీడర్‌గా ఎదగాలని కలలు కంటుంటాడు. అదే
నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రంగుల రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్) అంటే పిచ్చి.. గ్రామ పెద్దగా ఉండే అనిల్ (తాగుబోతు రమేష్)ను స్పూర్తిగా తీసుకొని దసరా పండుగ సందర్బంగా తన దోస్తులు పండు (జగన్ యోగిబాబు), రమేష్ (బన్నీ అభిరామ్ ), బాలు (అనిల్ గీలా) లతో కలసి రామన్న యూత్ అసోసియేషన్‌ను పెట్టి తనే లీడర్ అని ప్రకటించుకొనెలా ఫ్లెక్సీ పెడుతాడు. దాంతో తన అన్న ఫోటో లేకుండా ఫ్లెక్సీ కట్టారనే కోపంతో అనిల్ తమ్ముడు మహిపాల్ (విష్ణు) రాజు ఫ్రెండ్స్ తో గొడవపడతాడు. ఆ గొడవలో రామన్న బాగా తెలుసు మా డాడీ దుబాయ్ లో ఉండాడని కూడా రామన్నకు తెలుసని రాజు అంటాడు . మా అన్న సపోర్ట్ లేకుండా రామన్నను కలవలేరని ఛాలెంజ్ విసురుతాడు మహిపాల్ ఛాలెంజ్ ను ప్రిస్టేజ్ గా తీసుకున్న రాజు ఫ్రెండ్స్ సిద్దిపేటలో ఉన్న రామన్న ను కలవడానికి బయలుదేరుతారు. ఆలా వెళ్లిన వీరు రామన్నను కలిశారా? రామన్న కోసం వెళ్లిన వీరు హైదరాబాద్ కు ఎందుకు వెళ్లారు? రామన్నను కలుసుకొనే క్రమంలో వీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు రామన్న ను కలసి తన ఛాలెంజ్ నిరూపించుకున్నారా? చివరకు లీడర్‌గా ఎదిగాలన్న రాజు కల నెరవేరిందా? అనేది తెలుసుకోవాలి అంటే “రామన్న యూత్” సినిమా చూడాల్సందే.
నటీ నటుల పనితీరు
యూత్ లీడర్ గా ఎదగాలని కలలు కనే రాజు పాత్రలో నటించిన అభయ్ , పండు, రమేష్, బాలులతో కలసి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో కామెడీ ట్రాక్‌తో మెప్పించారనే చెప్పాలి. ప్రతి సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ లో కనిపించే రమేష్..విలేజ్ పొలిటికల్ లీడర్ గా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. మాజీ యం. యల్. ఏ పాత్రలో . శ్రీకాంత్ అయ్యంగార్ బాగా నటించాడు. సినిమాకు కీలకమైన క్యారెక్టర్‌గా మారిన పాత్రలో విష్ణు, ఉన్న కాసేపు యాదమ్మ రాజు నవ్వించిన తీరు బాగుంది. రాజు ఫ్రెండ్స్ కు ఫాదర్స్ గా నటించిన ఆనంద చక్రపాణి, విష్ణు,వేణు పొలసాని తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. రీల్స్ చేసే గృహిణిగా జబర్దస్త్ రోహిణి కనిపించినప్పుడల్లా నవ్వించారు.ఇంకా ఈ చిత్రంలో నటించిన వారందరూ కొత్తవారైనా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు..
సాంకేతిక నిపుణుల పనితీరు
ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయనే కథను రాసుకొని దానికి తెలంగాణ యాస భాషతో వుండే పాత్రలతో పాటు ఎమోషనల్ పాయింట్‌తో కనెక్ట్ చేసి డానికి కామెడీ సీన్స్ జోడించి తెరకెక్కించడంలో అభయ్ నవీన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సంగీత దర్శకుడు కమ్రాన్ అందించిన సంగీతం బాగుంది ఫహాద్ అబ్దుల్ మజీద్ అందిచింన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఆహ్లదపరిచే సంభాషణల ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రూపక్ రొనాల్డ్ సన్, అభయ్, ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై ఖర్చుకు వెనుకాడకుండా అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కామెడీ , ఎమోషన్ వాల్యూస్ లతో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రామన్న యూత్” సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది
Telugu.Cinebullet.Com Review Rating – 3/5