యష్ కి అతి జాగ్రత్త మంచిదేనా!!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ప్రభాస్ కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వల్ల దారుణమైన ఫలితాలను ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. ఆ విధంగా హీరో యశ్ కూడా కే జి ఎఫ్ లాంటి భారీ సినిమాలను చేసిన తరువాత విజయాన్ని అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ లా తొందర పడకుండా ఆచితూచి తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కేజిఎఫ్ లాంటి భారీ తరహాలోనే సినిమాను చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు.
మరి ఆయనకు కేజీఎఫ్ లాంటి భారీ విజయం అందుకున్న సినిమా తర్వాత ఈ చిత్రం చేస్తాడా చూడాలి. ప్రస్తుతం ఆయన నర్తన్ అనే ఓ దర్శకుడుతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ చిత్రం కూడా కేజీఎఫ్ లాంటి భారీ నేపథ్యం ఉన్న కథ అని తెలుస్తుంది.