మహేష్ కోసం ఆపనిచేస్తున్న రష్మిక!!

మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా యొక్క రెండో షెడ్యూల్ మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టబోతున్నట్లు కొన్ని రోజులనుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ పాట కోసం రష్మికను తీసుకుంటున్నట్టు సమాచారం. స్టార్ హీరోయిన్ లు ఐటెం సాంగ్ లు చేయడం కొత్తేమీ కాదు. గతంలో సమంత, కాజల్, పూజ హెగ్డే వంటి వారు ఇలా చేసి మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఇంత వరకు ఐటెం సాంగ్ లేదు.

తొలిసారిగా రష్మికతో తన సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.