వరుణ్ తేజ్ ప్రయోగం ఫలించేనా!!

టాలీవుడ్ ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా ఓ ప్రయోగాత్మక చిత్ర రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రెండు సినిమాలతో అలరించిన వరుణ్ ఇప్పుడు ఈ సినిమా తో వచ్చే ఏడాది వేసవి లో అలరించబోతున్నాడు. డిసెంబర్ లో సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. శక్తి ప్రతాప్ సింగ్ అనుఏ కొత్త కుర్రాడు ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతాప్ ఎయిర్ ఫోర్స్ స్టోరీ వెండి తెరపై అద్భుతంగా మలుస్తాడానే ధీమా వ్యక్తం అవుతుంది.

ఏదేమైనా వరుణ్ తేజ్ ఈ స్టోరీ ని సెలెక్ట్ చేసుకోవడం ఆసక్తి గా ఉంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. గతంలో అంతరిక్షం అనే వెరైటీ సినిమా చేసిన వరుణ్ ఆ సినిమా తరహా లోనే ఈ సినిమా ను చేయబోతున్నాడని చెప్పొచ్చు.