నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా “ఆర్టిస్ట్”

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “ఆర్టిస్ట్”. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. “ఆర్టిస్ట్” మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుండటం విశేషం

 

సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా ఆర్టిస్ట్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన చూస్తూ చూస్తూ, ఓ ప్రేమా సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లోనూ ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ ను మూవీ టీమ్ ఆశిస్తోంది.

 

 

నటీనటులు – సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్. పి. కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహమాధురి శర్మ, తదితరులు

 

 

టెక్నికల్ టీమ్

 

ఎడిటర్ – ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి

సినిమాటోగ్రఫీ – చందూ ఏజే

మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి

సౌండ్ డిజైన్ – సాయి మనీధర్ రెడ్డి

ఆర్ట్ – రవిబాబు దొండపాటి

ఫైట్ మైస్టర్ – దేవరాజు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సురేష్ బసంత్

ప్రొడక్షన్ కంట్రోలర్ – వాల్మీకి

లైన్ ప్రొడ్యూసర్ – కుమార్ రాజా

పీఆర్ఓ – జీ ఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

డిజిటల్ – సినిమా క్రానికల్

ప్రొడ్యూసర్ – జేమ్స్ వాట్ కొమ్ము

స్టోరీ, డైరెక్షన్ – రతన్ రిషి