రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమా!!

ఉప్పెన సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు బుచ్చి బాబు ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అందుకే చాలా రోజులనుంచి ఆ సినిమా పై పనిచేస్తున్నాడు. అయితే ఇంతకీ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి తేల్చక పోవడంతో ఈ దర్శకుడు ఇప్పుడు అదే కథను మరో దర్శకుడితో చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

తాజాగా ఈ దర్శకుడు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోని సినిమా ను రామ్ చరణ్ కి చెప్పి ఒప్పించిన సినిమా ను త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గా దీన్నే చేయబోతున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.