నెలకు కేవలం 67 రూపాయల ‘పాకెట్ ప్యాక్’ ఆఫర్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ

ఎగ్జైటింగ్ కంటెంట్ ను మరింతమంది సబ్ స్క్రైబర్స్ కు అందించేందుకు ‘పాకెట్ ప్యాక్’ ఆఫర్ అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ. కేవలం 67 రూపాయలతో మంత్లీ సబ్ స్క్రిప్షన్ ఇవ్వనుంది ఆహా. ఖర్చు తక్కువ, కిక్కు ఎక్కువ అనే క్యాప్షన్ తో తీసుకొచ్చిన ఈ కొత్త చవకైన మంత్లీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. 67 రూపాయలకే నెల రోజులు ఆహా ఓటీటీలో సరికొత్త వెబ్ సిరీస్ లు, సినిమాలు, గేమ్ షోస్, కుకరీ షోస్ ను ఎంజాయ్ చేయవచ్చు.

 

ఆహాలో ఫన్ అండ్ థ్రిల్లింగ్ గేమ్ షో సర్కార్ సీజన్ 5, హోమ్ టౌన్, త్రీ రోజెస్ సీజన్ 2, అప్సర వంటి ఫ్రెష్ ఎంటర్ టైన్ మెంట్ సబ్ స్క్రైబర్స్ కోసం రెడీ అవుతోంది. మీ కోసం కావాల్సినంత క్రియేటివ్ తెలుగు, తమిళ రీజనల్ కంటెంట్ ఆహాలో అందుబాటులో ఉంది. ఉగాది సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ అట్రాక్టింగ్ పాకెట్ ప్యాక్ ఆహాకు పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ ను జాయిన్ చేయనుంది.