అభిమానులకు ఖుషి చేస్తున్న పవన్ పిక్!!

ఎట్టకేలకు రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలకు హాజరు అయ్యాడు. గత కొన్ని రోజులుగా ఎంతో సస్పెన్స్ క్రియేట్ అవ్వగా ఫైనల్ గా ఈ సినిమా మొదలవడం విశేషం. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చాలా రోజులుగా వాయిదా పడగా ఎంతో సస్పెన్స్ తర్వాత ఈ సినిమా ను పవన్ మళ్ళీ మొదలుపెట్టాడు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో సినిమా యొక్క చిత్రీకరణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్కడ నుండి ఒక పిక్ కూడా లీక్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియా లో అభిమానులు ఈ సినిమా యొక్క షూటింగ్ పిక్ ను రిలీజ్ చేయవలసింది గా కోరుకున్నారు. అలా ఈ పిక్ విడుదల కావడం విశేష.

మరోసారి ఈ పిక్ లీక్ అవ్వడంతో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. వెండి తెరపై హరి హర వీరమల్లు సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. కీరవాణి ఈ సినిమా కి సంగీతం సమకూరుస్తుండగా ఈ క్రేజీ మూవీ లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.