ZEE5లో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న నితిన్ ‘రాబిన్‌హుడ్‌’

డైన‌మిక్ స్టార్ నితిన్ హీరోగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ ప్యాక్డ్ థ్రిల్ల‌ర్ ‘రాబిన్‌హుడ్’ మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం ZEE5లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసే ప్రేక్ష‌కులు ఉహించ‌లేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో సాగే ఈ చిత్రంలో ప్రేక్ష‌కులు కోరుకునే హై ఓల్టేజ్ యాక్ష‌న్ కూడా ఉంటుంది. ఈ చిత్రం మే 10 నుండి ZEE5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతూ ఉంది. అయితే యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘రాబిన్‌హుడ్’ దూసుకుపోయింది.

 

‘రాబిన్‌హుడ్‌’ క‌థ విష‌యానికి వ‌స్తే.. రామ్ (నితిన్‌) ఓ అనాథ‌, తెలివైన యువ‌కుడు. కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌నొక రాబిన్‌హుడ్‌గా మారి ధ‌న‌వంతుల నుంచి డ‌బ్బ‌ను దొంగిలించి అవ‌స‌ర‌మైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ సామ్రాజ్యానికి రాజ‌మైన వ్య‌క్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. అక్క‌డి నుంచి రామ్ క‌థ ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపు తీసుకుంటుంది. త‌ను నీరా (శ్రీలీల‌)తో క‌లిసి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన దొంగ‌త‌నాలు, ప్రాణాంత‌క‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌టానికి సిద్ధ‌మ‌వుతాడు. అంతా బాగుంద‌ని భావిస్తున్న త‌రుణంలో క‌థ అతి పెద్ద ట్విస్ట్ తిరుగుతుంది. అప్పుడు రామ్‌, నీరా ఏం చేశారు? స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనే ట్విస్ట్ ఏంటి? అనే అంశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఉత్కంఠ‌త‌కు గురి చేస్తాయి.

 

థియేటర్లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించిన ‘రాబిన్‌హుడ్’ ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ‘రాబిన్‌హుడ్’ ZEE5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ‘రాబిన్‌హుడ్’ 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో సరి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

 

ZEE5 గురించి

 

ZEE5 భారతదేశం మరియు భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మరియు లక్షలాది మంది వినోద ప్రియులకు బహుభాషా కథకుడు. ZEE5 గ్లోబల్ కంటెంట్ పవర్‌హౌస్ అయిన ZEE ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) నుండి వచ్చింది. వినియోగదారులకు ఎంపిక చేసుకునే తిరుగులేని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్; ఇది 3,400+ కంటే ఎక్కువ సినిమాలు; 200+ టీవీ షోలు, 170+ ఒరిజినల్స్, 5 లక్షల+ గంటల ఆన్-డిమాండ్ కంటెంట్‌తో కూడిన విస్తారమైన మరియు విభిన్నమైన కంటెంట్ లైబ్రరీని అందిస్తుంది. 12 భాషలలో (ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ) విస్తరించి ఉన్న కంటెంట్ ఆఫర్‌లో ఉత్తమ ఒరిజినల్స్, భారతీయ మరియు అంతర్జాతీయ సినిమాలు, టీవీ షోలు, సంగీతం, పిల్లల ప్రదర్శనలు, ఎడ్‌టెక్, సినీప్లేలు, వార్తలు, లైవ్ టీవీ మరియు ఆరోగ్యం & జీవనశైలి ఉన్నాయి. గ్లోబల్ టెక్ డిస్రప్టర్లతో భాగస్వామ్యం నుండి ఉద్భవించిన బలమైన డీప్-టెక్ స్టాక్, ZEE5 బహుళ పరికరాలు, పర్యావరణ వ్యవస్థలు, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో 12 నావిగేషనల్ భాషలలో సజావుగా మరియు హైపర్-వ్యక్తిగతీకరించిన కంటెంట్ వీక్షణ అనుభవాన్ని అందించడానికి వీలు కల్పించింది.