ZEE5లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌‌తో దూసుకుపోతోన్న సందీప్ కిషన్ ‘మజాకా’

 

ఉగాది సందర్భంగా ZEE5 తన వీక్షకులకు రెట్టింపు వినోదాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ZEE5లో తాజాగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మజాకా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. మజాకా ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన మజాకా చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. కామెడీ, రొమాన్స్, తండ్రీకొడుకుల సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కించిన మజాకా ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.

 

రావు రమేష్, సందీప్ కిషన్ కాంబినేషన్ సీన్లకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. తండ్రి-కొడుకులుగా నవ్విస్తూ, ఏడ్పించేసేలా చేసిన వారి నటన అందరినీ ఆకట్టుకుంది. మజాకా చిత్రంలో కామెడీతో పాటుగా మంచి సందేశాన్ని కూడా అందించారు. రీసెంట్‌గా వచ్చిన రఘు తాత, కుడుంస్థాన్, విమానం వంటి చిత్రాలు కామెడీతో పాటుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించారు. ప్రస్తుతం మజాకా చిత్రం కూడా ZEE5 ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో..

 

*ZEE5లో SVOD సౌత్ వైస్ ప్రెసిడెంట్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ* .. ‘ప్రాంతీయ చిత్రాల్లో ప్రస్తుతం మజాకా చిత్రం ZEE5లో ట్రెండ్ అవుతోంది. తెలుగులో కొత్త మైలురాయిని నెలకొల్పిన మజాకా అద్భుతమైన విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. రావు రమేష్, సందీప్ కిషన్‌ కాంబోని అందరూ ఇష్టపడుతున్నారు. తండ్రీకొడుకులుగా వారిద్దరి నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ విజయం మా ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ను అందించే ZEE5 నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది’ అని అన్నారు.

 

*రావు రమేష్ మాట్లాడుతూ* .. ‘మజాకాకు వచ్చిన అద్భుత స్పందన చూసి నేను నిజంగా థ్రిల్ అయ్యాను. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను జనాలు ZEE5 లో ఇంత ఆదరించడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ప్రేక్షకుల నుండి వచ్చిన సానుకూల స్పందన చూసి ఎంతో ఆనందమేస్తోంది. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చి వారికి ఎప్పుడూ నేను కృతజ్ఞుడినే’ అని అన్నారు.

 

*సందీప్ కిషన్ మాట్లాడుతూ* .. ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మజాకాకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. పక్కింటి అబ్బాయిలా ఉండే కృష్ణ పాత్రను పోషించడం సవాల్‌గా అనిపించినా.. అలాంటి పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. మజాకా అద్భుతమైన వినోదాన్ని పంచే చిత్రం. కామెడీతో పాటుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చూపించే ఈ చిత్రానికి ఇంతటి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

 

మీరు ఇంకా సినిమా చూడకపోతే వెంటనే ZEE5లో ‘మజాకా’ను చూసేయండి!

 

ZEE5 గురించి

ZEE5 భారతదేశం మరియు భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మరియు లక్షలాది మంది వినోద ప్రియులకు బహుభాషా కథకుడు. ZEE5 గ్లోబల్ కంటెంట్ పవర్‌హౌస్ అయిన ZEE ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) నుండి వచ్చింది. వినియోగదారులకు ఎంపిక చేసుకునే తిరుగులేని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్; ఇది 3,400+ కంటే ఎక్కువ సినిమాలు; 200+ టీవీ షోలు, 170+ ఒరిజినల్స్, 5 లక్షల+ గంటల ఆన్-డిమాండ్ కంటెంట్‌తో కూడిన విస్తారమైన మరియు విభిన్నమైన కంటెంట్ లైబ్రరీని అందిస్తుంది. 12 భాషలలో (ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ) విస్తరించి ఉన్న కంటెంట్ ఆఫర్‌లో ఉత్తమ ఒరిజినల్స్, భారతీయ మరియు అంతర్జాతీయ సినిమాలు, టీవీ షోలు, సంగీతం, పిల్లల ప్రదర్శనలు, ఎడ్‌టెక్, సినీప్లేలు, వార్తలు, లైవ్ టీవీ మరియు ఆరోగ్యం & జీవనశైలి ఉన్నాయి. గ్లోబల్ టెక్ డిస్రప్టర్లతో భాగస్వామ్యం నుండి ఉద్భవించిన బలమైన డీప్-టెక్ స్టాక్, ZEE5 బహుళ పరికరాలు, పర్యావరణ వ్యవస్థలు, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో 12 నావిగేషనల్ భాషలలో సజావుగా మరియు హైపర్-వ్యక్తిగతీకరించిన కంటెంట్ వీక్షణ అనుభవాన్ని అందించడానికి వీలు కల్పించింది.