డైరెక్టర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న యూత్‌ఫుల్ సోష‌ల్ డ్రామా ‘యుఫోరియా’ త్వరలోనే షూటింగ్ ప్రారంభం

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

సెన్సేషనల్

డైరెక్టర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న యూత్‌ఫుల్ సోష‌ల్ డ్రామా ‘యుఫోరియా’ త్వరలోనే షూటింగ్ ప్రారంభం

వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నుంది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.