యశోద మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

సరోగసి నేపథ్యంలో సమంత నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘యశోద’. చాలా రోజుల తర్వాత సమంత నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కి మంచి గుర్తింపు వచ్చింది. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించింది.

హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 11న రిలీజై ఘన విజయం సాధించింది. మొదట మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకున్నా పోటీగా సినిమాలేవి లేకపోవడంతో ప్రేక్షకులు యశోదకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో గర్భిణిగా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.డిసెంబర్ 9 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.

-Ramesh Reddy Chilakala