వరల్డ్ టాప్ 5 బెస్ట్ ఆల్బమ్స్ లిస్ట్ “ఖుషీ” మూవీ సాంగ్

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఖుషీ మూవీ నుంచి విడుదల చేసిన నా రోజా నువ్వే అనే పాట ప్రపంచాన్నే ఊపేస్తోంది. దాదాపు 15 మిలియన్ వ్యూస్ తో పాటు లక్ష లైక్స్ తో వాల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదవ స్థానాన్నిసొంతం చేసుకుని సత్తా చాటింది. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని భాషల నుంచీ అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే పాడాడు. ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ రాయడం ఓ విశేషమైతే.. ” నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే” అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం. ‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.. “, నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా.. ” అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది. ఈ సాహిత్యం అన్ని భాషల నుంచీ అద్భుతంగా కన్వే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆడియన్స్ ఖుషీ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను తమ ది బెస్ట్ ఆల్బమ్స్ లిస్ట్ లో పెట్టుకున్నారు. సినిమా థీమ్ ను తెలియజేస్తూనే అద్భుతమైన ఫీల్ నూ ఇస్తోన్న ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ది బెస్ట్ సాంగ్స్ లో ఐదవ స్థానంలో నిలవడం.. మూవీ బ్లాక్ బస్టర్ కు ఊతం ఇస్తుందనే చెప్పాలి. థళ

ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన ఖుషీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.

నటీనటులు:

విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:

మేకప్ : బాషా

కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్

ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక

ఫైట్స్ : పీటర్ హెయిన్

రచనా సహకారం : నరేష్ బాబు.పి

పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా

పబ్లిసిటీ : బాబ సాయి

మార్కెటింగ్ : ఫస్ట్ షో

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్

మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్

డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్

సి.ఇ.ఓ : చెర్రీ

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి

నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.