తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘విమానం’. విలక్షణ నటుడు సముద్ర ఖని ఇందులో వీరయ్య అనే మధ్య వయస్కుడి తండ్రి పాత్రలో నటించారు. ఇతని భార్య చనిపోయి ఉంటుంది. అంగ వైకల్యంతో బాధపడుతుంటాడు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. జూన్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
మనందరిలో విమాన ప్రయాణం అంటే తెలియని ఉద్విగ్నత ఉంటుంది. ముఖ్యంగా మన తొలి విమాన ప్రయాణాన్ని జీవితంలో మరచిపోలేం. ఆశ్చర్యపోయే విషయమేమంటే విమాపం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమా చేయక ముందు వరకు విమానంలో ఓసారి కూడా ప్రయాణించలేదు. ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడు తొలిసారి ఆయన ఆ అనుభూతిని పొందారు. తన తొలి విమాన ప్రయాణ అనుభూతి గురించి దర్శకుడు శివ ప్రసాద్ యానాల మాట్లాడుతూ ‘‘నేను విమానం సినిమా చేస్తున్నప్పుడు చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఎలా ప్రయాణించాలో తెలియలేదు. ఫ్లైట్ బోర్డింగ్ చేయటం, ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు ఎయిర్ పోర్టులో ఎక్కడ అడగాలి .. ఇలా చాలా సందేహాలు ఉండేవి. ఈ విషయం తెలిసిన జీ స్టూడియోస్ నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీని చిత్రీకరించటానికి ఓ వ్యక్తిని నియమించింది. ఈ విషయం తెలిసి నాకు ఇంకా టెన్షన్ మొదలైంది. విమానాన్ని దగ్గర నుంచి చూడగానే చాలా సంతోషమేసింది. ఆశ్చర్యంతో పాటు ఎగ్జయిట్‌మెంట్, తెలియని ఆనందం కలిగింది. ఇప్పటికీ నా తొలి విమాన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా చాలా సంతోషమేస్తుంది’’ అన్నారు.
ఈ నేపథ్యంలో విమానం నిర్మాతలు ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించారు. అలాగే ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బహుమతులను కూడా అందిస్తామని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు :
సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్
సాంకేతిక వర్గం :
ప్రొడ్యూసర్స్: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్)
రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల
సినిమాటోగ్రపీ: వివేక్ కాలేపు
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
మ్యూజిక్: చరణ్ అర్జున్
ఆర్ట్: జె.జె.మూర్తి
డైలాగ్స్: హను రావూరి (తెలుగు), ప్రభాకర్ (తమిళం)
లిరిక్స్ : స్నేహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హనుమంత్ రావు బోయపాటి
పి.ఆర్.ఒ: నాయుడు – ఫణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువరాజ్ (తమిళ్)
డిజిటల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా