తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9 మూవీ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ సముద్ర ఖని నటిస్తోన్న ద్విభాషా చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. జూన్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన గ్లింప్స్, సిన్నోడా ఓ సిన్నోడా సాంగ్ ప్రోమో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో ఇప్పటికే సముద్ర ఖని పోషిస్తున్న వీరయ్య పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్ర దర్శక నిర్మాతలు సినిమాలోని ఇతర పాత్రధారులను పరిచయం చేయటమే కాకుండా ఆయా పాత్రల పేర్లను కూడా ఆడియెన్స్‌కు ఇంట్రడ్యూస్ చేశారు.
వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. విమానం సినిమా ప్రధానంగా తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే చిత్రం. మరి ఈ తండ్రీ కొడుకులకు సుమతి, రాజేంద్రన్, డేనియల్, కోటి పాత్రలకు ఉన్న లింకేంటి? పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ కనెక్టివిటీ ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే జూన్ 9 వరకు ఆగాల్సిందే.
ఈ సందర్భంగా మేకర్స్ జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు పెద్ద పీట వేస్తున్న మన ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని విమానం సినిమాను రూపొందిస్తున్నాం. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్న అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ పాత్రలకు పోస్టర్స్‌ను రిలీజ్ చేశాం. మంగళవారం సినిమా నుంచి సిన్నోడా ఓ సిన్నోడా అనే సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నాం. అంతే కాకుండా ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బహుమతులను కూడా అందిస్తాం’’ అని అన్నారు.
నటీనటులు:
సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్
సాంకేతిక వర్గం:
ప్రొడ్యూసర్స్: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్)
రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల
సినిమాటోగ్రపీ: వివేక్ కాలేపు
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
మ్యూజిక్: చరణ్ అర్జున్
ఆర్ట్: జె.జె.మూర్తి
డైలాగ్స్: హను రావూరి (తెలుగు), ప్రభాకర్ (తమిళం)
లిరిక్స్ : స్నేహన్(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పి.ఆర్.ఒ: నాయుడు – ఫణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువరాజ్ (తమిళ్)
డిజిటల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా