అంచ‌నాల‌ను పెంచేసిన హీరో అరుణ్ విజ‌య్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘మిషన్: చాప్ట‌ర్ 1’ టీజ‌ర్‌

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను రూపొందిస్తూ, వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌రన్‌. ఈ ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు వైవిధ్య‌మైన, ఎవ‌రూ రూపొందించ‌ని, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే క‌థాంశాలున్న సినిమాల‌కు డిస్ట్రిబ్యూష‌న్ ప‌రంగానూ అండగా నిలుస్తోంది. ఆడియెన్స్‌ను అల‌రించే సినిమాల‌ను స‌రైన స‌మ‌యంలో అందించ‌టంలో ఎప్పుడూ ముందుంటోంది. అందుక‌నే సినీ ప్రేమికుల‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ గురించిన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.

ఇప్పుడ‌లాంటి లిస్టులోకి చేరిన మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం ‘మిషన్: చాప్ట‌ర్ 1’. ‘ఫియర్‌లెస్ జ‌ర్నీ’ ట్యాగ్ లైన్. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాను విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మించారు. బుధవారం (మార్చి 5)రోజున ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

‘మిషన్: చాప్ట‌ర్ 1’ను గ‌మ‌నిస్తే ఇది లండ‌న్‌లో పేరు మోసిన జైలు వాండ్స్ వ‌ర్త్ జైలు బ్యాక్ డ్రాప్‌లో న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచంలోని ఖైదీలంద‌రూ ఆ జైలులో ఉంటారు. ఆ జైలుకు సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఎమీ జాక్స‌న్ న‌టిస్తుంది. ఇక ఆ జైలులో ఓ ఖైదీ పాత్ర‌లో హీరో అరుణ్ విజ‌య్ న‌టించారు. కుటుంబంతో ఇండియా నుంచి లండ‌న్ వ‌చ్చిన అరుణ్ విజ‌య్‌ని అక్క‌డి పోలీసులు అరెస్ట్ చేస్తారు. త‌న కుమార్తెకు మ‌రో రెండు రోజుల్లో ఆప‌రేష‌న్ ఉంటుంది. త‌నేమో జైలులో ఉంటాడు. త‌న కూతురేమో తండ్రి కోసం ఎదురు చూస్తుంటుంది. అస‌లేం జరిగింది..హీరో అరుణ్ విజ‌య్ ఏ కార‌ణాల‌తో తను వాండ్స్‌వ‌ర్త్ జైలుకి వెళ్లాడు. చివ‌ర‌కు వాండ్స్ వ‌ర్త్ జైలు సూప‌రిడెంట్ ఆఫీస‌ర్ అయిన ఎమీ జాక్స‌న్ ఏమైనా హెల్ప్ చేసిందా? అనే వివ‌రాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అద్బుత‌మైన స‌న్నివేశాలు, ఆక‌ట్టుకునే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ‘మిషన్: చాప్ట‌ర్ 1’ టీజ‌ర్ సూప‌ర్బ్‌గా ఉంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ బీజీఎం సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలుస్తుంద‌న‌టంలో డౌటేలేద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

డైరెక్ట‌ర్ విజ‌య్ త‌న‌దైన ప్లానింగ్‌తో ఇంత భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని 70 రోజుల్లోనే పూర్తి చేశారు. అలాగే ఈ మూవీ కోసం లండ‌న్ వాండ్స్ వ‌ర్త్ జైలు చెన్నైలో పునః సృష్టించటం విశేషం. హీరో అరుణ్ విజ‌య్ రిస్కీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో స్వ‌యంగా ఆ స‌న్నివేశాల్లో న‌టించారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆయ‌న యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉన్నాయి. టీజ‌ర్‌లో ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది. అలాగే నైట్ షాట్స్‌, డ్రామా ఓ ఆస‌క్తిని మ‌రింత పెంచుతోంది.

న‌టీన‌టులు:

అరుణ్ విజ‌య్‌, ఎమీ జాక్స‌న్‌, నిమిషా స‌జ‌య‌న్‌, అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌, విరాజ్ ఎస్‌, జాస‌న్ షా

సాంకేతిక‌వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జికెఎం త‌మిళ్ కుమర‌న్‌, నిర్మాత – సుభాస్క‌ర‌న్‌, ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి, కో ప్రొడ్యూస‌ర్‌: సూర్య వంశీ ప్ర‌సాద్ కోత‌, జీవ‌న్ కోత‌, మ్యూజిక్‌: జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, స్క్రిప్ట్‌, స్క్రీన్ ప్లే: ఎ.మ‌హ‌దేవ్‌, డైలాగ్స్‌: విజ‌య్‌, సినిమాటోగ్ర‌ఫీ: సందీప్ కె.విజ‌య్‌, ఎడిట‌ర్‌: ఆంథోని, స్టంట్స్ సిల్వ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: శ‌ర‌వ‌ణ‌న్ వ‌సంత్‌, కాస్ట్యూమ్స్ : రుచి మునోత్‌, మేక‌ప్‌: ప‌ట్టనం ర‌షీద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.గ‌ణేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె.మ‌ణి వ‌ర్మ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ (యుకె): శివ కుమార్‌, శివ శ‌ర‌వ‌ణ‌న్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ : మ‌నోజ్ కుమార్‌.కె, కాస్ట్యూమ‌ర్‌: మొడేప‌ల్లి ర‌మ‌ణ‌, సౌండ్ డిజైన్‌: ఎం.ఆర్‌.రాజ‌శేఖ‌ర‌న్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: డినోట్‌, స్టిల్స్‌: ఆర్‌.ఎస్‌.రాజా, ప్రమోష‌న్‌, స్ట్రాట‌జీస్‌: షియం జాక్‌, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ , ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ప్ర‌తూల్ ఎన్‌.టి.