“డ్రింకర్ సాయి” స్పెషల్ షో చూసి, మూవీ టీమ్ కు ప్రశంసలు అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. తాజాగా “డ్రింకర్ సాయి” సినిమా స్పెషల్ షోను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి, యంగ్ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల, నటుడు మహేశ్ ఆచంట చూశారు. అనంతరం

దర్శకుడు మారుతి మాట్లాడుతూ – డైరెక్టర్ కిరణ్ అసోసియేట్ గా నాతో ఈ రోజుల్లో సినిమాకు వర్క్ చేశారు. డ్రింకర్ సాయి సినిమా చాలా బాగా రూపొందించాడు. టైటిల్ చూసి నెగిటివ్ గా ఫీలవుతారు గానీ మంచి కాన్సెప్ట్ తో చేసిన చిత్రమిది. చివరి 20 నిమిషాలు మూవీ చాలా బాగుంది. హీరో ధర్మకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అతని నటనలో మెచ్యూరిటీ కనిపించింది. మ్యూజిక్, డీవోపీ ఇతర అన్ని క్రాఫ్ట్ లు ఆకట్టుకున్నాయి. టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా, ఈ సినిమా మరింత పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ – డ్రింకర్ సాయి సినిమాను ఈతరం ప్రేక్షకులంతా చూడాలి. ఎంటర్ టైన్ మెంట్, ఎంజాయ్ మెంట్, లవ్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంది. డైరెక్టర్, హీరో సూపర్బ్ గా వర్క్ చేశారు. డ్రింకర్ సాయి టీమ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

నటుడు మహేశ్ ఆచంట మాట్లాడుతూ – డ్రింకర్ సాయి మూవీ చూసి ఎంజాయ్ చేశాను. హీరో ధర్మ నా ఫ్రెండ్. బయట రెగ్యులర్ గా కలుస్తుంటాం. క్యాజువల్ గా కనిపిస్తాడు. కానీ స్క్రీన్ మీద తన నటనతో సర్ ప్రైజ్ చేశాడు. చాలా ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేశాడు. డైరెక్టర్ కిరణ్ గారికి, ఇతర టీమ్ అందరికీ కంగ్రాంట్స్. అన్నారు.

నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
స్టిల్స్ – రాజు వైజాగ్ (SVA)
వీఎఫ్ఎక్స్ – సుమరామ్ రెడ్డి.ఎన్
ఆర్ట్ – లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి