సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించిన ఈ సినిమా నిన్న (శుక్రవారం) థియేటర్ లలో రిలీజైంది. ఎమోషన్ ఎంటర్ ఫ్లస్ టైన్ మెంట్ కలిసి తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో
దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ – ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్రొడ్యూసర్స్ కు గట్స్ ఉండాలి. మైక్ మూవీస్ సంస్థ ఆ రిస్క్ తీసుకుంది. వాళ్లు బాగుంటేనే మాలాంటి కొత్తవాళ్లకు అవకాశాలు వస్తాయి. ఈ సినిమాను ఏ భాషలో రీమేక్ చేసినా మైక్ మూవీస్ మాత్రమే నిర్మించాలని కోరుకుంటున్నా. సినిమా ప్రారంభంలో మేల్ ప్రెగ్నెన్సీ గురించి వివరాలు చెప్పడం వల్ల ప్రేక్షకులకు కాన్సెప్ట్ సులభంగా అర్థమైంది. మా సినిమాలోని ఎమోషన్ తో పాటు బ్రహ్మాజీ గారి కామెడీ సూపర్బ్ గా వర్కవుట్ అయ్యింది. ఆ సీక్వెన్స్ వస్తున్నప్పుడు థియేటర్ లో డైలాగ్స్ వినిపించనంతగా ప్రేక్షకులు గోల చేస్తూ ఎంజాయ్ చేశారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కుటుంబమంతా కలిసి చూడాల్సిన మూవీ. అన్నారు.
హీరోయిన్ రూపా కొడవయూర్ మాట్లాడుతూ – ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు సక్సెస్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు లాక్ డౌన్ టైమ్ నుంచి అలవాటు అయ్యారు. ఇప్పుడు భాషలకు అతీతంగా మంచి సినిమాలకు ఆదరణ దక్కుతోంది. నేను బెంగాళీ సినిమాలు చూసేందుకు ఇష్టపడతాను. ఇలాంటి ట్రెండ్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా చేసేందుకు సరైన సమయం అనుకుంటున్నా. అని చెప్పింది.
సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ మాట్లాడుతూ – ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు మంచి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చానని నాకు గుర్తింపు దక్కుతోంది. ఈ సినిమాకు వచ్చినన్ని మెసేజ్ లు నాకు ఇప్పటిదాకా ఏ సినిమాకూ రాలేదు. సినిమాలోని ఎమోషన్ వల్లే నేను మంచి మ్యూజిక్ చేయగలిగాను. అన్నారు.
కమెడియన్ అభిషేక్ మాట్లాడుతూ – ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి సినిమాలో పార్ట్ అయ్యాననే సంతోషం కలుగుతోంది. ఇకపై కమెడియన్ గానే కాదు ఏ క్యారెక్టర్ వచ్చినా నటిస్తాను. నాకు నటన అంటే ఇష్టం. అన్నారు.
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ – ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వస్తున్నరెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు థాంక్స్. కొత్త కాన్సెప్ట్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు తెరపై ఇలాంటి సినిమా రాలేదు. మేము ఆ ప్రయత్నం చేశాం. మేము ఈ కథ అనుకున్నప్పుడు కొంతమంది బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాతో చేస్తే నేషనల్ వైడ్ మంచి హిట్ అవుతుందని సజెస్ట్ చేశారు. అయితే ఆలోగా కోవిడ్ రావడంతో ఆ ప్రయత్నం ఆపేశాం. సోహైల్ మన టాలీవుడ్ ఆయుశ్మాన్ ఖురానా అనుకుంటాను నేను. అంత బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఇది కొత్త కథ. సెన్సిటివ్ సబ్జెక్ట్. కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా మొత్తం సినిమా రిజల్ట్ వేరేగా ఉంటుంది. తెలుగు ఆడియెన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తుంది. మేము ఈ కథను నమ్మి బడ్జెట్ ఎక్కువైనా చేశాం. అమ్మ కోసం చేస్తున్న సినిమా కాబట్టి బడ్జెట్ గురించి ఆలోచించలేదు. మా సినిమా చూసిన లేడీ ఆడియెన్స్ ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో హీరోలకు, ప్రొడ్యూసర్స్ కు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. చిన్న సినిమాలకు ఎప్పుడో ఒకసారి ఒక మంచి రిలీజ్ డేట్ దొరుకుతుంది. ఆ ఫ్రైడేనే పెద్ద హీరోల సినిమాలు, తమిళ హిట్ సినిమాల రీ రిలీజ్ లు చేస్తున్నారు. దయచేసి మీ రీ రిలీజ్ లు ఫ్రైడే కాకుండా మరో రోజు చూసి చేసుకోవాలని కోరుతున్నా. అన్నారు.
హీరో సోహైల్ మాట్లాడుతూ – నేను పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని రాశారు. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉంది. సిటీలో మల్టీఫ్లెక్స్ వెళ్లి చూశా. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకుంటున్నారు. ఒక మంచి సినిమా చేశామని చెబుతున్నారు. పబ్లిక్ టాక్ వినండి.. ఏ ఒక్కరూ నెగిటివ్ గా చెప్పలేదు. అక్కడే మేము సక్సెస్ అయ్యాం. యూట్యూబ్ లో కొందరు స్పాయిలర్స్ సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి సినిమా రిలీజైన వెంటనే ఆ సినిమాను దెబ్బతీసే వీడియోలు చేయకండి. మీ వల్ల సినిమా కోసం పనిచేసే ఎంతోమంది నష్టపోతారని గుర్తుపెట్టుకోండి. అన్నారు.