జూన్ 16, హైదరాబాద్: తెలుగు నెంబర్ వన్ ఓటీటీ మాధ్యమం ఆహా.. అన్నీ వర్గాల ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఆహా ఒరిజినల్స్, బ్లాక్ బస్టర్ మూవీస్, రియాలిటీ షోస్, టాక్ షోస్, కొరియన్ డ్రామాస్, హాలీవుడ్ మూవీస్, డెయిలీ సీరియల్స్, పిల్లల కోసం ఆహా కిడ్స్, న్యూస్ అండ్ గేమింగ్ ఇలా అందరీ మెప్పిస్తూ ముందుకు సాగుతోంది ఆహా. కుటుంబం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసే మధుర క్షణాలను ఈ మాధ్యమం మన ముందుకు తీసుకు వస్తుంది. విభిన్నమైన భావోద్వేగాలను ఈ ప్రపంచానికి అందిస్తోన్న ఆహా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, చార్మింగ్ స్టార్ శ్రీలీలతో ‘100% వెరైటీ, 100 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్’ క్యాంపెయినింగ్‌ను ప్రారంభించింది.
LINK – https://www.aha.video/player/shortvideo/arjun-leela
మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో భారీ చిత్రాలను రూపొందించటమే కాకుండా ఐకాన్ స్టార్‌తో ఇంతకు ముందు అల వైకుంఠపురములో, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ క్యాంపెయినింగ్‌ను డైరెక్ట్ చేశారు.ఆహాలోకి ఓ కొత్త ప్రేక్షకుడు వచ్చాడంటే, అది కేవలం ఆ వ్యక్తిపైమాత్రమే కాదు .. ఆ కుటుంబంపై ఆహా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. యాక్షన్, రొమాన్స్, డాన్స్, డ్రామా.. ఇలా అన్నీ జోనర్స్ బ్యాక్ డ్రాప్స్‌లకు సంబంధించిన సన్నివేశాలతో తెలుగు ప్రేక్షకులకు ఆహా నిరంతరం కనెక్ట్ అవుతుంది. ఇది రోజువారీ జీవితంలో ఆహా యొక్క ప్రాముఖ్యతను అందరికీ ఇంకా బలంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఆహా ప్రారంభించిన ఈ సరికొత్త క్యాంపెయినింగ్ ద్వారా ప్రేక్షకులందరూ వారి కుటుంబాలతో, స్నేహితులతో కలిసి ఉండేలా ప్రతీ క్షణాన్ని ఎంతో గొప్పగా మార్చి వేస్తుంది ఆహా.
ఈ సందర్భంగా ఆహాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆహాతో మరోసారి కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉంది. మూడేళ్ల ప్రయాణంలో ఆహా ఎందరో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అందుకు కారణం.. నిరంతరం వైవిధ్యమైన కంటెంట్‌ను అందించటమే. డిఫరెంట్ ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులందరికీ ఇదొక గమ్యస్థానంగా మారింది. ఒక యాక్టర్‌గా ఆహా ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో బలమైన స్థానాన్ని ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను. మున్ముందు ఆహాతో ఈ అనుబంధం ఇంకా బలంగా కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల సాధారణ జీవితాల్లో భాగం కావటానికి ఆహా ఎలప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. వారి కంటెంట్‌ను 6 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసున్న వారి వరకు వీక్షించవచ్చు. తాజాగా ఆహా ప్రారంభించిన 100 % వెరైటీ 100% తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ క్యాంపెయినింగ్ ఆడియెన్స్ జీవితాల్లోకి మరింత ఆనందాలను తీసుకువస్తుంది. ప్రతీ కంటెంట్‌ను అందులో జోనర్‌ను ఆవిష్కరించేలా ఈ క్యాంపెయినింగ్‌ను రూపొందించాం. మేం ఏం చెప్పాలనుకున్నామో ఆ కథను మరింత సరళంగా చెప్పే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం ఇంకా బలంగా, భావోద్వేగంగా ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోతుంది’ అన్నారు.
ఆహా సీఇఓ రవికాంత్ సబ్నవిష్ మాట్లాడుతూ ‘‘మేం ఇది వరకే అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తామని చెప్పాం. ఇప్పుడు ప్రారంభించిన 100% వెరైటీ, 100% తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ క్యాంపెయినింగ్ అనేది మా కమిట్‌మెంట్‌ను మరింత పెంచింది. దాన్ని మేం ఇంకా గొప్పగా నిలబెట్టుకుంటాం. ప్రేక్షకుల ప్రాధాన్యతలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అది మా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా గొప్పగా ఉంటూనే వారికి అర్థమైయ్యేలా సులభతరంగా ఉండాలని మేం భావిస్తూనే ఉంటాం. మా వద్ద లక్షల్లో ప్రేక్షకులున్నారు. వారందరికీ విభిన్నంగా వినోదాన్ని అందించేలా ఓ గమ్యంలాగా మేం మారుతున్నాం. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, గేమ్స్ నుంచి న్యూస్ ఇలా ఏదైనా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం మా దగ్గరే లభ్యమవుతుంది’’ అన్నారు.
టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ మై హోం గ్రూమ్ సంయుక్తంగా 2020లో ఆహాను ప్రారంభించారు. తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసం లోకల్ కంటెంట్‌ను అందించే గమ్యస్థానంగా ఆహా మారింది. బలమైన బ్రాండింగ్, ఆకర్షణీయమైన సబ్‌స్క్రిప్షన్ ఆఫర్స్‌లతో ఆహా సూపర్ ఎంటర్‌టైన్మెంట్ యాప్‌గా ఆవిష్కరించబడింది. దీని ఫలితంగా ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ ప్రాంతీయ ఓటీటీ మాధ్యమంగా ఆహా అవతరించింది. 32 మిలియన్ యాడ్ డౌన్‌లోడ్స్, 12 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఇందులో ఉన్నారు. ఇంత పెద్ద నెంబర్ అనేది ఆహాపై తెలుగు ప్రేక్షకులు ఉంచిన నమ్మకాన్ని, విధేయతను తెలియజేస్తుంది. 2000 గంటలకు పైగా అసాధారణమైన కంటెంట్, 350కు పైగా ప్రత్యేకమై ప్రోగ్రామింగ్‌తో ప్రేక్షకులకు ఆహా నాణ్యమైన వినోదాన్ని అందిస్తూ క్వాలిటీ ఎంటర్‌టైన్మెంట్ అనే పదానికి పర్యాయ పదంగా మారింది.
ఆహా గురించి…
2020లో ఆహా ప్రారంభమైంది. 100 % లోకల్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందించే ఇండియన్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్. ఈ 100% ఓటీటీ మాధ్యమం సినిమాలు, సిరీస్‌లు, షోష్ ఇలా తిరుగులేని వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతీ శుక్రవారం ఓ కొత్త రిలీజ్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. 100% లోకల్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తామనే మాటను నిలబెట్టుకున్న ఆహా తమిళంలో 100 % లోకల్ ఎంటర్‌టైన్మెంట్‌ను సిరీస్‌లు, సినిమాల రూపంలో అందించటాన్ని ఈ మధ్యనే ప్రారంభించింది. అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రై.లి, మై హోం గ్రూప్, అల్లు అరవింద్ (గీతా ఆర్ట్స్) వారి జాయింట్ వెంచర్ ఆహా.
మరిన్ని వివరాల కోసం https://www.Aha.video/allను ఫాలోకండి.