చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం “షరతులు వర్తిస్తాయి”. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “షరతులు వర్తిస్తాయి” సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా ..’లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – దర్శకుడు కుమారస్వామి నాకు చాలాకాలంగా తెలుసు. బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి. ఈ పాట చూస్తుంటే తెలంగాణ మట్టివాసన కనిపిస్తోంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, పెద్దింటి అశోక్ కుమార్ సాహిత్యం ఆకట్టుకున్నాయి. ఇక ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుందని అనుకుంటున్నా. నేను ఫిదా సినిమాలో వచ్చిండే పాట రూపొందించినప్పుడు అదే ఆశించాను. తెలంగాణ యాసలో పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. చైతన్య రావ్ యాక్టింగ్ చాలా నేచురల్ గా చేస్తున్నాడు. షరతులు వర్తిస్తాయి టీమ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. మీ పాటలతో పాటు సినిమా కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ – షరతులు వర్తిస్తాయి మూవీ నుంచి ఈ పాటను ఎవరు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మా డైరెక్టర్ కుమారస్వామి శేఖర్ కమ్ముల గారి పేరు చెప్పారు. ఆయన సినిమాలంటే అక్షరకు చాలా ఇష్టం. నేను కూడా శేఖర్ కమ్ముల గారికి అభమానిని. ఆయన సినిమాలు రూపొందించే విధానం, వాటికి ఎంచుకునే నేపథ్యం ఎంతో బాగుంటాయి. పన్నెండు గుంజల పందిర్ల కిందా పాట మీ అందరికీ నచ్చుతుంది. ఈ ఏడాది 35 లక్షల పెళ్లిల్లు ఉన్నాయట. వాటిలో లక్షలాది పెళ్లిళ్లలో ఈ పాట మారు మ్రోగుతుందని ఆశిస్తున్నా. పెళ్లి ప్రారంభం నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలు ఈ పాటలో చక్కగా చిత్రీకరించారు. ఇలాంటి మంచి సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్స్ ను అభినందిస్తున్నా. అన్నారు.
హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – పన్నెండు గుంజల సాంగ్ కు మంచి లిరిక్స్ ఇచ్చిన పెద్దింటి అశోక్ కుమార్ గారికి, క్యాచీ ట్యూన్ ఇచ్చిన సురేష్ బొబ్బిలి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే మా పాటను రిలీజ్ శేఖర్ కమ్ముల గారికి కృతజ్ఞతలు. వచ్చే పెళ్లిళ్ల సీజన్ లో మా పాట బాగా వినిపిస్తుందని చెప్పగలను. ఖచ్చితంగా ఈ సాంగ్ వైరల్ అవుతుంది. నాకు షరతులు వర్తిస్తాయి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు కుమారస్వామికి థ్యాంక్స్. ఈ లవ్ లీ సాంగ్ ను ఎంజాయ్ చేయండి. అన్నారు.
డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ – శేఖర్ కమ్ముల గారి తన బిజీ షెడ్యూల్స్ లో మాకు టైమ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాం. షరతులు వర్తిస్తాయి మూవీలో ఈ పన్నెండు గుంజల పాట ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఈ పాట విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
లిరిసిస్ట్ పెద్దింటి అశోక్ కుమార్ మాట్లాడుతూ – దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఎంతో ఇన్స్ పైర్ చేస్తుంటాయి. ఆయన తెలంగాణ నేటివిటీతో చేసిన సినిమాలు, పాటలే మాకు ఇన్సిపిరేషన్ ఇస్తాయి. పన్నెండు గుంజల పాటలో పెళ్లి లో మైలపోలు నుంచి అప్పగింతల దాకా అన్ని కార్యక్రమాలను ఆకట్టుకునేలా మా దర్శకుడు చిత్రీకరించారు. ఆయన పెళ్లి రీసెంట్ గా జరిగింది. ఆ పెళ్లి కార్యక్రమాలన్నీ గుర్తుండి ఉంటాయి. అందుకే మూవీలో పాటలో చూపించారు. చైతన్య రావ్ ఈ మూవీలో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
హంగూ ఆర్భాటం లేకుండా తక్కువ ఖర్చుతో సింపుల్ గా పెళ్లి ఎలా చేసుకుందామో చెప్పు అంటూ హీరో చైతన్య హీరోయిన్ ను అడిగినప్పుడు హీరోయిన్ ‘ పెళ్లి లైఫ్ లో ఒక్కసారే చేసుకుంటాం. గ్రాండ్ గా ఉండాలి. పెళ్లిలోని ప్రతి సందర్భం జీవితమంతా గుర్తుండిపోవాలి..’ అని సమాధానం చెచ్చి హీరోను ఒప్పిస్తుంది. అలా పెళ్లి నేపథ్యంగా ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా..’ పాట సాగుతుంది. ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా.. పచ్చని పందిట్ల ముత్యాల పోలు..ముత్యాల పోలు మీద గజ్జెళ్ల కాని..గజ్జెళ్ల కాని మీద పెండ్లి పీటలు…’ అంటూ పెళ్లిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని వర్ణిస్తూ రైటర్ పెద్దింటి అశోక్ కుమార్ ఆకట్టుకునేలా ఈ పాట రాశారు. ఈ పాటకు సురేష్ బొబ్బిలి చేసిన కంపోజిషన్ అంతే నేటివిటీతో అందంగా ఉంది. మొగుళ్ల శంకరమ్మ, శంకర్ బాబు, తేలు విజయ, వొల్లల వాణి ఈ పాట పాడారు.
నటీనటులు – చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ డైరెక్టర్ – గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ – సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ – అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ – పెద్దింటి అశోక్ కుమార్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ – శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం – కుమారస్వామి (అక్షర)