బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’. డంకీ డ్రాప్ 2 – లుట్ పుట్ గయా, అంటూ తొలి పాటగా హృదయానికి హత్తుకునే రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రపంచం ఏమనుకున్నా పర్లేదని హర్డీకి అండగా మను నిలబడుతుంది. ఆ సమయంలో హర్డీ, మనుల ప్రేమ ప్రయాణాన్ని ఈ పాట తెలియజేసేలా ఉంది. మను పట్ల తన మనసులోని భావనను హర్డీ పాట రూపంలో తెలియజేస్తున్నాడు.
ఈ మెలోడీ పాటకు ప్రీతమ్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, అర్జిత్ సింగ్ వినసొంపైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. స్వానంద్ కిర్కిరే, ఐ.పి.సింగ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ట్యూన్‌కు తగ్గట్టు గణేష్ ఆచార్య చక్కటి డాన్స్ మూమెంట్స్‌ను కంపోజ్ చేశారు. దీంతో పాటలోని రొమాంటిక్ ఫీల్కి అదనపు హంగు తోడైనట్లు అనిపిస్తుంది.
అద్భుతంగా, హృదయానికి హత్తుకునేలా చక్కటి కథలను సినిమాల రూపంలో తెరకెక్కించటంలో డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి సిద్ధహస్తుడు. ఆయన గత చిత్రాలన్నీ వీటిని రుజువు చేశాయి. ఇప్పుడు డంకీ వంటి మరో మాస్టర్ పీస్తో మన ముందుకు రాబోతున్నారు. చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్‌తో ఈ సినిమా నిండి ఉంటుంది. ఇది నాలుగు స్నేహితులకు సంబంధించిన కథ. ఈ నలుగురు స్నేహితులు వారి కలలను నిజం చేసుకోవటానికి విదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఈ ప్రయాణంలో వారెలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నారనేదే కథాంశం. స్నేహం, ప్రేమ వంటి అంశాలతో నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ అండ్ టీమ్.
‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, కణిక థిల్లాన్ ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో విడుదలవుతుంది.