గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒకే టాపిక్. చిరంజీవి, గరికపాటి ల మధ్య ఇష్యూ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. నార్మల్ గానే రామ్ గోపాల్ వర్మ ఎంతో చమత్కారంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు.
అందులో ఈ విషయంలో ఎంతో చమత్కారంగా ట్వీట్ వేశాడు అని చెప్పాలి. ‘ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్‌ని అవమానించిన గుర్రంపాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం, త్తగ్గేదెలె’ అని తేనె తుట్టిని కదిపారు. అపై మరిన్ని ట్వీట్లు చేశారు. ‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’ అని ఓ ట్వీట్ చేశారు.అయితే వర్మ ట్వీట్ అక్కడితో ఆపలేదు అనే చెప్పాలి.
ఇకపోతే ఇటీవల బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి పాల్గొన్నారు. అక్కడి వచ్చిన వాళ్లు చిరంజీవితో ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. అయితే, చిరంజీవి ఫొటోలు దిగడం ఆపి వేదికపై కూర్చోకపోతే తాను నిర్మొహమాటంగా అక్కడి నుంచి వెళ్లిపోతానంటూ గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.