బేబి మూవీతో గతేడాది బ్లాక్ బస్టర్ మూవీ దక్కించుకున్నారు యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ఇప్పుడాయన పలు క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతున్నారు. ప్రొడ్యూసర్ గా సినిమా మీద ప్యాషన్ తో పాటు హ్యుమానిటీ విషయంలో ఎస్ కేఎన్ ముందుంటున్నారు. ఇటీవల దర్శకుల సంఘం ఎన్నికల్లో సంఘ సభ్యుల సంక్షేమ కార్యక్రమాల కోసం 10 లక్షల రూపాయల డొనేట్ చేశారు ఎస్ కేఎన్.
ఇప్పుడు రోడ్డు ప్రమాదానికి గురైన ఎన్టీఆర్ అభిమానికి అండగా నిలబడ్డారు. అతనిది పేద కుటుంబం కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విరాళాల కోసం రిక్వెస్ట్ చేశారు. ఈ రిక్వెస్ట్ కు స్పందించిన ఎస్ కేఎన్ 50 వేల రూపాయలు తన వంతు సహాయంగా పంపించారు. ఎప్పుడూ వేదికల మీద సరదాగా పంచులతో, ప్రాసలతో మాట్లాడుతూ నవ్వించే ఎస్ కేఎన్ లో ఇలాంటి స్పందించే మనసు, మానవత్వం ఉండటం మరో కోణం అనుకోవచ్చు.