పరశురామ్ యొక్క ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ సినిమా క్రేజ్‌ని రెగ్నెట్ చేస్తుంది, థియేటర్లు చాలా కాలం తర్వాత కుటుంబాలను చూస్తున్నాయి

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల తన ప్రత్యేకతను ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి చాటుకుంటున్నారు. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది.

ఇటీవల ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. ఈ టైమ్ లో మళ్లీ తన ఫ్యామిలీ స్టార్ మూవీతో సకుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పిస్తున్నారు పరశురామ్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. గతంలో శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తెరకెక్కించారు డైరెక్టర్ పరశురామ్. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో పరశురామ్ రూపొందించిన ఫ్యామిలీ స్టార్ కూడా ఈ దర్శకుడి సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలుస్తోంది.