‘ఓసి పెళ్లామా..’ పాట విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా నుండి విడుదల

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ఐదో లిరికల్ పాట ‘ఓసి పెళ్లామా..’ను రిలీజ్ చేశారు.

పబ్ లో పార్టీ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓసి పెళ్లామా..’ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ రాయగా…హేషమ్ అబ్దుల్ వాహాబ్ మరోసారి క్యాచీ ట్యూన్ అందించారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ పాడారు. కాశ్మీర్ లో ఫస్ట్ టైమ్ తనను చూసిన, ముందెనక చూడకుండ మనసిచ్చిన…బాబు మాట పక్కనెట్టి బయటకొచ్చిన, లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసిన…అంటూ హీరో తన ప్రేమ, పెళ్లి ప్లాష్ బ్యాక్ గురించి చెబుతూ సాగుతుందీ పాట.

సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ‘ఖుషి’ ఇంకో 6 రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విప్లవ్, ఆరాధ్య ప్రేమకథను అందంగా తెరపై చూపించబోతోందీ సినిమా.

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:

మేకప్ : బాషా

కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్

ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక

ఫైట్స్ : పీటర్ హెయిన్

రచనా సహకారం : నరేష్ బాబు.పి

పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా

పబ్లిసిటీ : బాబ సాయి

మార్కెటింగ్ : ఫస్ట్ షో

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్

మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్

డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్

సి.ఇ.ఓ : చెర్రీ

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి

నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి

కొరియోగ్రఫీ : శివ నిర్వాణ

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.