ఎనర్జిటిక్ ర్యాప్ బీట్ తో ‘హ్యాపీ ఎండింగ్’ మూవీ నుంచి ‘ఓరి పిల్లగాడ’ లిరికల్ సాంగ్ రిలీజ్

చెప్పాలని ఉంది, అలాంటి సిత్రాలు, శాకుంతలం వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హ్యాపీ ఎండింగ్. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా…ఇవాళ ఎనర్జిటిక్ ర్యాప్ బీట్ తో సాగే ‘ఓరి పిల్లగాడ..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

క్యాచీ బీట్ తో ర్యాప్ స్టైల్ లో ‘ఓరి పిల్లగాడ…’ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు. సంగీత దర్శకుడు నిడమర్తి రవి అందించిన ఎనర్జిటిక్ ట్యూన్ కు లక్ష్మీ ప్రియాంక సాహిత్యాన్ని రాయగా.. లావణ్య సిస్ట పాడింది. ‘ఓరి పిల్లగాడ ఓరకంట చూసి పోరా ఓరి పిల్లగాడ..’ అంటూ ఈ పాట సాగింది. ఈ పాటకు ర్యాప్ ను ఎంసీ టెడీ అందించారు. హ్యాపీ ఎండింగ్ మూవీని త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు – అజయ్ ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష్ రోషన్, జియ శర్మ, వంశీ నెక్కంటి, కేఎంఎమ్ మణి, కమల్ తుము, శ్వేత తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం – రవి నిడమర్తి

సినిమాటోగ్రఫీ- అశోక్ సీపల్లి

ఎడిటర్ – ప్రదీప్ ఆర్ మోరమ్

స్క్రీన్ ప్లే – నాగసాయి

లైన్ ప్రొడ్యూసర్ – ప్రసాద్ బిల్లకుర్తి

పీఆర్వో – జీఎస్కే మీడియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కిరణ్ రామానుజం

ప్రొడ్యూసర్స్ – యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల

స్టోరీ డైరెక్షన్ – కౌశిక్ భీమిడి