మూవీ : మిస్టర్ ప్రెగ్నెంట్
రిలీజ్ డేట్ : 18/08/23
డైరెక్టర్ : శ్రీనివాస్ వింజనంపాటి
నిర్మాతలు :అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి.
నటీ నటులు : సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు
సంగీతం : శ్రావణ్ భరద్వాజ్
బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సయ్యద్ సోహైల్ ర్యాన్… ప్రస్తుతం హీరోగా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకుముందు అతని నుంచి వచ్చిన రెండు సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో అబ్బాయిల ప్రెగ్నెన్సీ అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ తో మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో నటించాడు.
వినడానికి వింతగా ఉన్న.. అసంభవమైన ఈ కాన్సెప్ట్ ఒక సరికొత్త ప్రయోగం అని చెప్పవచ్చు.రూపా కొడువయుర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్ వహించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..
కథ :
ఇది మూవీలో హీరో గౌతమ్(సోహైల్) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిగా పెరిగి పెద్దవాడవుతాడు. టాటూ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన ఇతను అంటే మహి కి చాలా ప్రేమ. గౌతమ్ అమ్మాయిని పట్టించుకోకపోయినా వదలకుండా వెంటపడుతూనే ఉంటుంది. ఫైనల్ గా ఆమెతో పెళ్లికి ఒప్పుకున్న గౌతం పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ పెడతాడు.
పిల్లలు అంటే తనకు నచ్చదు కాబట్టి లైఫ్ లో పిల్లలు వద్దు అని ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. మహి కూడా అందుకు ఒకే చెప్పడంతో ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా గడుపుతారు. ఈ నేపథ్యంలో సడన్గా మహి ప్రెగ్నెంట్ అవుతుంది.. ఇక ఆ తరువాత వీళ్ళ లైఫ్ లో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. దీనికి గౌతమ్ రియాక్షన్ ఏమిటి? అసలు గౌతం మిస్టర్ ప్రెగ్నెంట్ ఎలా అయ్యాడు? సమాజానికి ఈ మూవీ కన్వెజ్ చేయాలి అనుకున్న మెసేజ్ ఏమిటి? తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ చిత్రాన్ని స్క్రీన్ పై చూడాల్సిందే.
విశ్లేషణ :
మూవీ కాన్సెప్ట్ సరికొత్తగా ఉన్నప్పటికీ కాస్త కాంట్రవర్షల్ అనే అనవచ్చు. కంటెంట్ కనెక్ట్ అయితే చిన్న సినిమాని కూడా ఓ రేంజ్ హిట్ చేసే ప్రేక్షకులు ఉన్న సమయం కాబట్టి క్రేజీ కాన్సెప్ట్ తో సినిమాలు తీయడానికి డైరెక్టర్ ముందుకు వస్తున్నారు. ఇలా వచ్చినదే మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ. ఇది నిజంగా ప్రయోగాత్మకమైన చిత్రం. అసలు అబ్బాయి ప్రెగ్నెంట్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఏమిటో తెలుసుకోవడానికి అయినా ఈ మూవీ ని చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
డైరెక్టర్ కొత్త వాడైనా కానీ కత్తి మీద సామి లాంటి ఈ స్టోరీని ఎంతో కన్వెన్సీంగా తెరకెక్కించారు అని చెప్పవచ్చు. ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రతి విషయం ఎంతో క్లారిటీగా అందరికీ అర్థమయ్యే విధంగా మూవీ ని తీశారు. మామూలుగా ఇలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమాలు అయితే చాలా సీరియస్ గా ఉంటాయి లేకపోతే పిచ్చ కామెడీగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో అన్ని రుచులు సమపాళ్లల్లో కలిసాయి. కామెడీ ,లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంట్, ప్రెగ్నెంట్ వుమన్ పడే పెయిన్స్ అన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్ :
ఈ మూవీలో బ్రహ్మాజీ ఎపిసోడ్లో కామెడీ మాత్రం ఓ రేంజ్ లో ఉంది.
అమ్మతనం గురించి హీరో చెప్పే డైలాగ్స్ ఖచ్చితంగా థియేటర్లో ప్రేక్షకులను టచ్ చేస్తాయి
ఈ మూవీలో గౌతమ్ పాత్ర సోహైల్ కెరియర్ లోనే గుర్తుండిపోయే ఒక మైలురాయి.
ఎక్కడ వల్గారిటీ లేకుండా ఎంతో క్లియర్ గా ఉన్న ఈ చిత్రం ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ.
మైనస్ పాయింట్స్ :
మూవీలో హీరో పడే తపన ఇంకా స్ట్రాంగ్ గా చూపిస్తే బాగుండేది.
ఫస్ట్ హాఫ్ కాస్త రెగ్యులర్గా సాగినట్లు అనిపిస్తుంది.
చివరి మాట :
కుటుంబ కథా చిత్రం కుటుంబ సమేతంగా అందరూ చూడాల్సిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’
రేటింగ్ : 3