ఫిబ్రవరి 26న హైదరాబాద్ ని మైమరిపించనున్న స్వర జ్ఞాని ఇళయరాజా!!

ఎన్నో చిత్రాలకి అద్భుతమైన స్వరాలని, భాషని దాటిన భావాన్ని అందిస్తూ ఉన్న ‘మాస్ట్రో’ ఇళయరాజా 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నా ఆయన సంగీత మేధస్సు ఏమాత్రం తగ్గలేదు.

మునుపెన్నడూ లేని విధంగా తన సంగీత ఝరితో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేయడానికి ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో అతి పెద్ద కచేరి చేయనున్నారు.

గచ్చిబౌలి స్టేడియం లో ‘హైదరాబాద్ టాకీస్’ వారు నిర్వహించనున్న ఈ భారీ ఈవెంట్ లో స్వర జ్ఞాని ఇళయరాజా, చేయనున్నారు.

దర్శకుడు విజయ్ చిత్రీకరించిన ఈ ఈవెంట్ ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేయనుండగా ఇటీవల విడుదల చేసిన ప్రోమో అంచనాలని పెంచేసింది.

నేడే మీ టికెట్లని పేటిఎం మరియు పేటిఎం ఇన్సైడర్ లో బుక్ చేసుకోండి.