సుహాస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ ‘జనక అయితే గనక’ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ ‘నువ్వే నాకు లోకం’ విడుదల

‘ఓసారైనా చూడవే, ఉండిపోవే, ఉండిపోవే…

వింటావా నా మాటనే, ఉండిపోవే, ఉండిపోవే…

మనసే ఇరుకై, నలిగానేనే,

గదిలో నువ్వు లేక,

నిద్ర కుదురు చెదిరిపోవే,

నువ్విలా వదిలాక…’

అంటూ, తనను వదిలి దూరమైన భార్యపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆమె కోసం బాధపడుతున్న భర్త హృదయం ఎంత బాధలో ఉందో తెలుసుకోవాలంటే, ‘జనక అయితే గనక…’ సినిమా చూడాల్సిందే అని చెబుతున్నారు మేకర్స్.

వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో, దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల కానుంది.

‘బలగం’ వంటి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి మరోసారి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ‘జనక అయితే గనక’ విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా, ఈ సినిమా నుంచి ‘నువ్వే నాకు లోకం…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కృష్ణకాంత్ రచించిన ఈ పాటను కార్తీక్ పాడారు.