కన్నడ లో సంచలన విజయం సాధించిన కాంతారా సినిమా ఇప్పుడు తెలుగు లో కూడా సంచలన విజయం దిశగా ముందుకు దూసుకెళ్తుంది. వసూళ్ల పరంగా ఈ సినిమా కి అడ్డొచ్చె సినిమా వచ్చే వారంలో కూడా కనిపించడం లేదు. 30 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా క్రితం నెల 30వ తేదీన కన్నడలో విడుదలై 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అయితే తెలుగు లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడానికి పెద్దగా సమయం తీసుకోవట్లేదని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా 16 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. చూస్తుంటే వారం రోజుల్లో ఈ సినిమా కి వంద కోట్ల రాబడి ఉండబోతుంది అని చెప్తున్నారు. డిఫరెంట్ జోనర్ తో కూడిన సినిమా కావడం వలన .. దగ్గరలో ఆ స్థాయి సినిమాల పోటీ లేకపోవడం వలన దీపావళికి ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.